Home » Entertainment » Pavala Shyamala Comments On Jr Ntr
Entertainment

Pavala Shyamala : జూనియర్ ఎన్టీఆర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన పావలా శ్యామలా…!

Authored By
aruna
The Telugu News | Updated on: January 17, 2024 6:21 pm
Advertisement

Pavala Shyamala : నటి పావలా శ్యామల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. బాబాయ్ అబ్బాయ్ సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆమె నటిగా ఎన్నో సినిమాలలో నటించారు. అయితే ఆమె అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఇటీవల ఆర్థిక ఇబ్బందుల కారణంగా తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె సినిమాలలో నటించిన సమయంలో ఆర్థికపరమైన విషయాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉండటం వలన ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది. ఎన్నో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న తనకు మెగాస్టార్ చిరంజీవి సహాయం చేశారని ఆమె ఇంటర్వ్యూలో తెలిపారు. చిరంజీవి ప్రతినెల తనకు కొంత అమౌంట్ వచ్చే విధంగా సహాయం చేశారని ఇదివరకు కూడా ఆమె పేర్కొన్నారు.

Advertisement

అయితే తాజా ఇంటర్వ్యూలో పావలా శ్యామల స్టార్ హీరోల పై షాకింగ్ కామెంట్స్ చేశారు. సహాయం కోసం మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళితే వాళ్లు ఇంట్లో లేరని అబద్ధాలు చెబుతున్నారని, ఫోన్ నెంబర్లు కూడా తప్పుగా ఇస్తున్నారని, దీంతో వాళ్లను కలవడం కుదరటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మెగాస్టార్ చిరంజీవి మాత్రమే సహాయం చేశారని ఎవరు సహాయం చేయలేదని తెలిపారు. తనకు మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలు 10 లక్షల రూపాయల వరకు సహాయం చేశారని వస్తున్న వార్తలకు ఆమె చెక్ పెట్టారు. తనకు ఎవరూ డబ్బు సహాయం చేయడం లేదని ఆమె తెలిపారు. తనకు ఈ విధంగా డబ్బు సహాయం చేశారు అంటూ వచ్చే వార్తలలో ఏమాత్రం నిజం లేదని

ఇలాంటి వార్తలు ప్రచారం చేయటం వలన తనకు సహాయం చేసేవారు కూడా చేయరు అంటూ ఆమె వెల్లడించారు. ఈ విధంగా తనకు ఎవరు కూడా ఆర్థికపరమైన సహాయం చేయలేదంటూ పావలా శ్యామల స్టార్ హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలా స్టార్ హీరోల గురించి మాట్లాడడంతో పలువురు హీరోల పేర్లు చెప్పుకుని పాపులర్ కావాలని చూస్తుందని, ఆమె గొంతెమ్మ కోరికలను తీర్చడం ఎవరికీ సాధ్యం కాదంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వలన తనకు ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయని కొందరు వెల్లడించగా, మరికొందరు ఈమె ప్రవర్తనలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయంటూ ఆమె గురించి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె స్టార్ హీరోలపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి