
Pavitra Lokesh : నరేష్ బేబిని వెతికీ మరీ తెచ్చిన పవిత్ర.. ఇద్దరి రచ్చ మాములుగా లేదుగా..!
Pavitra Lokesh : సీనియర్ నటుడు నరేష్ గత కొద్ది రోజులుగా పవిత్ర చేస్తున్న సహజీవనం విషయంతో వార్తలలో నిలుస్తున్నాడు. ఆమెని పెళ్లి చేసుకోకపోయిన కూడా ఆమెతో కలిసి తిరుగుతూ తెగ సందడి చేస్తున్నాడు. అయితే ఒకప్పుడు హీరోగా నటించిన నరేష్ ఇప్పుడు సపోర్టింగ్ పాత్రలలో కనిపిస్తూ ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్నాడు. అయితే నరేష్ నటించిన తాజా చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. ఆగస్టు 14న ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కానుంది. దానికి సంబంధించి టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. పవిత్ర లోకేశ్ ఈ టీజర్ ని లాంచ్ చేశారు.
ఈ సినిమాలో.. నరేష్ తో పాటు శ్రీలక్ష్మి, ప్రియా వడ్లమాని, రాగ్ మయూర్ ఇతరులు కీలక పాత్రలు పోషించారు. అనురాగ్ పలుట్ల దర్శకత్వం వహించారు. బాపినీడు.బి, సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన పవిత్ర.. నరేష్‌ని ఆకాశానికి ఎత్తేసింది. నరేష బేబీ పోయిందని తెగ బాధపడ్డారు. ఆ బేబీని వెతికి పట్టుకుని వచ్చాను. చాలాకష్టపడి ఇక్కడి వరకు తీసుకొచ్చాను. ఇక దాన్ని కాపాడుకునే బాధ్యత మీదే అంటూ వెల్లడించింది పవిత్ర లోకేష్. ఇక నరేష్ గురించి చెబుతూ ఆయన ఇండియాలోనే ఒక ఫైనెస్ట్ యాక్టర్ అని ప్రశంసలు కురిపించింది. పాత్రవస్తే దాన్ని చిన్న పిల్లాడిలా తీసుకుని నేర్చుకుని చేస్తాడంటూ ఆకాశానికి ఎత్తేసింది.
Pavitra Lokesh : నరేష్ బేబిని వెతికీ మరీ తెచ్చిన పవిత్ర.. ఇద్దరి రచ్చ మాములుగా లేదుగా..!
నరేష్ ఎలాంటి పాత్ర చేసినా అందులో జీవిస్తాడు. ముందుగానే ప్రిపేర్ అవుతాడు. బాగా చేయాలని తపిస్తుంటాడు. ఆయనతో పార్ట్ కావడం ఆనందంగా ఉంది. చ్చితంగా అందరికి నచ్చే సినిమా అవుతుందని వెల్లడించింది పవిత్ర లోకేష్. ఆమె మాటలకు పక్కనే ఉన్న నరేష్ ఒప్పొంగిపోయాడు. ఇక ఆ తర్వాత తన బేబీ ఎక్కడికిపోయిందో చెప్పాడు నరేష్. బెంగుళూరు హైవేపై దాబా వద్దఉందని, లోపల పవిత్ర రాగిముద్ద నాటుకోడి తింటుందని, ఆసమయంలో మత్తు మందు పెట్టి తీసుకొచ్చినట్టు నరేష్ చెప్పడం అందరికి కాస్త వినోదం అందించినట్టు అయింది. మొత్తానికి చాలా రోజుల తర్వాత పవిత్ర, నరేష్ లు ఒకే వేదికపై కనిపించి తెగ సందడి చేశారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.