Pavitra Lokesh : న‌రేష్ బేబిని వెతికీ మరీ తెచ్చిన ప‌విత్ర‌.. ఇద్ద‌రి ర‌చ్చ మాములుగా లేదుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pavitra Lokesh : న‌రేష్ బేబిని వెతికీ మరీ తెచ్చిన ప‌విత్ర‌.. ఇద్ద‌రి ర‌చ్చ మాములుగా లేదుగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :27 July 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Pavitra Lokesh : న‌రేష్ బేబిని వెతికీ మరీ తెచ్చిన ప‌విత్ర‌.. ఇద్ద‌రి ర‌చ్చ మాములుగా లేదుగా..!

Pavitra Lokesh : సీనియ‌ర్ న‌టుడు నరేష్ గ‌త కొద్ది రోజులుగా ప‌విత్ర చేస్తున్న స‌హ‌జీవ‌నం విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. ఆమెని పెళ్లి చేసుకోక‌పోయిన కూడా ఆమెతో క‌లిసి తిరుగుతూ తెగ సంద‌డి చేస్తున్నాడు. అయితే ఒక‌ప్పుడు హీరోగా న‌టించిన న‌రేష్ ఇప్పుడు స‌పోర్టింగ్ పాత్ర‌ల‌లో క‌నిపిస్తూ ప్రేక్ష‌కులకి మంచి వినోదం పంచుతున్నాడు. అయితే న‌రేష్ న‌టించిన తాజా చిత్రం ‘వీరాంజ‌నేయులు విహార‌యాత్ర‌’. ఆగ‌స్టు 14న ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కానుంది. దానికి సంబంధించి టీజ‌ర్ లాంచ్ ఈవెంట్ హైద‌రాబాద్ లో ఘ‌నంగా నిర్వ‌హించారు. పవిత్ర లోకేశ్ ఈ టీజ‌ర్ ని లాంచ్ చేశారు.

Pavitra Lokesh న‌రేష్‌పై ప్ర‌శంస‌లు..

ఈ సినిమాలో.. నరేష్ తో పాటు శ్రీలక్ష్మి, ప్రియా వడ్లమాని, రాగ్‌ మయూర్ ఇతరులు కీలక పాత్రలు పోషించారు. అనురాగ్‌ పలుట్ల దర్శకత్వం వహించారు. బాపినీడు.బి, సుధీర్‌ ఈదర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. టీజ‌ర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన ప‌విత్ర‌.. న‌రేష్‌ని ఆకాశానికి ఎత్తేసింది. నరేష బేబీ పోయిందని తెగ బాధపడ్డారు. ఆ బేబీని వెతికి పట్టుకుని వచ్చాను. చాలాకష్టపడి ఇక్కడి వరకు తీసుకొచ్చాను. ఇక దాన్ని కాపాడుకునే బాధ్యత మీదే అంటూ వెల్లడించింది పవిత్ర లోకేష్‌. ఇక న‌రేష్ గురించి చెబుతూ ఆయ‌న ఇండియాలోనే ఒక ఫైనెస్ట్ యాక్టర్‌ అని ప్రశంసలు కురిపించింది. పాత్రవస్తే దాన్ని చిన్న పిల్లాడిలా తీసుకుని నేర్చుకుని చేస్తాడంటూ ఆకాశానికి ఎత్తేసింది.

Pavitra Lokesh న‌రేష్ బేబిని వెతికీ మరీ తెచ్చిన ప‌విత్ర‌ ఇద్ద‌రి ర‌చ్చ మాములుగా లేదుగా

Pavitra Lokesh : న‌రేష్ బేబిని వెతికీ మరీ తెచ్చిన ప‌విత్ర‌.. ఇద్ద‌రి ర‌చ్చ మాములుగా లేదుగా..!

నరేష్‌ ఎలాంటి పాత్ర చేసినా అందులో జీవిస్తాడు. ముందుగానే ప్రిపేర్‌ అవుతాడు. బాగా చేయాలని తపిస్తుంటాడు. ఆయనతో పార్ట్ కావడం ఆనందంగా ఉంది. చ్చితంగా అందరికి నచ్చే సినిమా అవుతుందని వెల్లడించింది పవిత్ర లోకేష్‌. ఆమె మాటలకు పక్కనే ఉన్న నరేష్‌ ఒప్పొంగిపోయాడు. ఇక ఆ త‌ర్వాత త‌న బేబీ ఎక్కడికిపోయిందో చెప్పాడు నరేష్‌. బెంగుళూరు హైవేపై దాబా వద్దఉందని, లోపల పవిత్ర రాగిముద్ద నాటుకోడి తింటుందని, ఆసమయంలో మత్తు మందు పెట్టి తీసుకొచ్చినట్టు నరేష్‌ చెప్పడం అంద‌రికి కాస్త వినోదం అందించిన‌ట్టు అయింది. మొత్తానికి చాలా రోజుల త‌ర్వాత ప‌విత్ర‌, న‌రేష్ లు ఒకే వేదికపై క‌నిపించి తెగ సంద‌డి చేశారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది