pawan Kalyan : సింగపూర్ చేరుకున్న పవన్, చిరంజీవి, సురేఖ.. మార్క్ శంకర్ ఆరోగ్యం ఎలా ఉంది అంటే..?
ప్రధానాంశాలు:
సింగపూర్ చేరుకున్న పవన్, చిరంజీవి, సురేఖ.. మార్క్ శంకర్ ఆరోగ్యం ఎలా ఉంది అంటే..?
pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లోని ఒక స్కూల్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్.. అక్కడ కార్యక్రమాలను ముగించుకుని సింగపూర్ వెళ్లారు. మార్క్ శంకర్‌కు చేతులు, కాళ్లకు గాయాలుకాగా.. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది.

pawan Kalyan : సింగపూర్ చేరుకున్న పవన్, చిరంజీవి, సురేఖ.. మార్క్ శంకర్ ఆరోగ్యం ఎలా ఉంది అంటే..?
pawan Kalyan ప్రమాదం తప్పింది..
వెంటనే స్కూల్ సిబ్బందిఆస్పత్రికి తరలించారు. అక్కడ అతనికి చికిత్స అందిస్తున్నారు. అయితే బాబుని చూసేందుకు పవన్‌తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చిరంజీవి దంపతులు సింగపూర్ చేరుకున్నారు. కాసేపట్లో మార్క్ శంకర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లనున్నారు. పవన్, చిరంజీవి దంపతులు
బాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్‌నేవా సింగపూర్‌లో ఉంటున్నారు.. ఆమె గతేడాది సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. తన చదువు కోసం అన్నా లెజ్‌నేవా కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌తో కలిసి సింగపూర్‌లో ఉంటున్నారు. అక్కడ స్టడీస్ చేస్తూ.. కుమారుడ్ని కూడా సింగపూర్‌లో చదివిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒకటి రెండు సందర్భాల్లో సింగపూర్ వెళ్లొచ్చారు.