Lavanya Tripathi : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి పవన్ కళ్యాణ్.. రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి భార్యతో సహా ఇటలీకి పవర్ స్టార్ | The Telugu News

Lavanya Tripathi : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి పవన్ కళ్యాణ్.. రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి భార్యతో సహా ఇటలీకి పవర్ స్టార్

Lavanya Tripathi : ఎట్టకేలకు టాలీవుడ్ లవ్ బర్డ్స్ ఒక్కటవుతున్నారు. చాలా ఏళ్ల నుంచి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. చివరకు తమ ఇళ్లలోని పెద్దలను ఒప్పించి మరీ ఇద్దరూ ఒక్కటవ్వబోతున్నారు. అది కూడా డెస్టినేషన్ వెడ్డింగ్. అక్కడో ఇక్కడో కాదు.. వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా ఇటలీలో నవంబర్ 1 న జరగనుంది. పెళ్లికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీకి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :28 October 2023,3:00 pm

ప్రధానాంశాలు:

  •  నవంబర్ 1 న వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి

  •  ఇటలీలో గ్రాండ్ గా జరగబోతున్న పెళ్లి

  •  ఇప్పటికే ఇటలీ చెక్కేసిన మెగా ఫ్యామిలీ

Lavanya Tripathi : ఎట్టకేలకు టాలీవుడ్ లవ్ బర్డ్స్ ఒక్కటవుతున్నారు. చాలా ఏళ్ల నుంచి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. చివరకు తమ ఇళ్లలోని పెద్దలను ఒప్పించి మరీ ఇద్దరూ ఒక్కటవ్వబోతున్నారు. అది కూడా డెస్టినేషన్ వెడ్డింగ్. అక్కడో ఇక్కడో కాదు.. వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా ఇటలీలో నవంబర్ 1 న జరగనుంది. పెళ్లికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీకి చెక్కేసింది. అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య వీళ్ల పెళ్లి జరగనుంది. నవంబర్ 1 న ఇటలీలో పెళ్లి తర్వాత నవంబర్ 5న హైదరాబాద్ లో రిసెప్షన్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ ఇటలీకి చేరుకుంది. ఇక.. అల్లు వారి ఫ్యామిలీ కూడా ఇటలీ వెళ్లేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. లావణ్య కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ఇటలీకి వెళ్లిపోయారు. ఇక.. రాజకీయాల్లో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ కూడా ఒక వారం రోజులు తన రాజకీయాలకు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా వరుణ్ తేజ్ పెళ్లికి ఇటలీకి బయలుదేరారు.

తన భార్య అన్నా లెజినోవాతో కలిసి పవన్ కళ్యాన్ ఇటలీ బయలుదేరారు. హైదరాబాద్ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి ఇటలీకి బయలుదేరారు. విమానాశ్రయంలో తన భార్యతో కలిసి వెళ్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓవైపు తెలంగాణలో ఎన్నికలు, ఏపీలో రాజకీయాలు హీటెక్కిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ పెళ్లికి వెళ్తారో లేదో అనే డౌట్ ఉండేది. కానీ.. చివరకు పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సినిమాలకు ఒక వారం రోజులు బ్రేక్ ఇచ్చి పెళ్లికి బయలుదేరారు.

Lavanya Tripathi : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ కార్డు వైరల్

మరోవైపు లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఉన్న వివరాల ప్రకారం.. ప్రీ వెడ్డింగ్ వేడుకలు అక్టోబర్ 30నే ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 30న కాక్ టెయిల్ పార్టీ, 31న హల్దీ సెరమనీ, ఆ తర్వాత మెహందీ సెరమనీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత నవంబర్ 1న పెళ్లి జరగనుంది. నవంబర్ 5న ఇండస్ట్రీ ప్రముఖుల కోసం మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లో రిసెప్షన్ జరగనుంది.

kranthi

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...