Pawan Kalyan : ఫ్యాన్స్ కన్ఫ్యూజన్.. చిరంజీవిని పవన్ కళ్యాణ్ అవమానించాడా? ఆకాశానికి ఎత్తాడా?
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా రాజ మహేంద్రవరం నుండి నరసాపురం వరకు ర్యాలీగా పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆ సమయంలో జనసేన అభిమానులు మరియు కార్యకర్తలు భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ మీటింగ్ కి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ఆ మీటింగ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పరిపాలన పై తీవ్ర స్థాయిలో అసహనం […]
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా రాజ మహేంద్రవరం నుండి నరసాపురం వరకు ర్యాలీగా పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆ సమయంలో జనసేన అభిమానులు మరియు కార్యకర్తలు భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ మీటింగ్ కి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ఆ మీటింగ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పరిపాలన పై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇటీవల ఇండస్ట్రీ ప్రముఖులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి భేటీ గురించి కూడా ఇండైరెక్టుగా పవన్ కళ్యాణ్ స్పందించారు.
ఎంత పెద్ద స్థాయి వాళ్ళ అయినా తన దగ్గరికి వచ్చి చేతులు జోడించి ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఇది రాచరిక పాలన అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి తో ప్లీజ్ ప్లీజ్ ఇండస్ట్రీకి సాయం చేయండి అంటూ విజ్ఞప్తి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దాంతో మెగాస్టార్ అలా అడుక్కోవడం ఏమాత్రం బాలేదు అంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే విషయాన్ని మళ్ళీ ప్రస్తావించడంతో చిరంజీవిని పవన్ కళ్యాణ్ అవమానించాడా లేదంటే చిరంజీవి యొక్క గొప్పదనాన్ని చాటాడా అంటూ కొందరు చర్చిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కి చిరంజీవి అలా వెళ్లడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ చిరంజీవి ఇండస్ట్రీ కోసం ఇండస్ట్రీ యొక్క బాగు కోసం అలా వెళ్లి జగన్ ను రిక్వెస్ట్ చేశాడు. అంతే తప్పితే తన వ్యక్తిగత అవసరాల కోసం కాదు. కనుక ఇక్కడ చిరంజీవిని పవన్ కళ్యాణ్ విమర్శించినట్లుగా కానీ అవమానించినట్లు గా కానీ ఏమీ లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో చిరంజీవి యొక్క గొప్పతనం మరోసారి నిరూపితమైంది అంటూ మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ మొత్తం చిరంజీవికి జై కొట్టాలని వారు అంటున్నారు.