Pawan Kalyan : ఏది ముందు ఏది వెనక.. క్లారిటీ ఇవ్వని పవన్ కళ్యాణ్..?
Pawan Kalyan : గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల విషయంలో పెద్ద కన్‌ఫ్యూజన్ నెలకొంటుంది. ఆయన నటిస్తున్న సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయో..ఎప్పుడు రిలీజ్ అవుతాయో..అసలు ఏ సినిమా ముందు రిలీజ్ అవుతుందో..ఏది పోస్ట్ అవుతుందో పవన్‌కే క్లారిటీ రావడం లేదనేది ఇన్స్‌సైడ్ టాక్. కమిటవడానికి చక చకా 5-6 ప్రాజెక్ట్స్ కమిటైయ్యారు. కానీ, వాటిని ఫినిష్ చేయాలంటే రాజకీయాల వల్ల కుదరడం లేదు. మళ్ళీ ఎలక్షన్స్ హడావుడి మొదలవబోతోంది.దాంతో పవన్ చేస్తున్న సినిమాలు పూర్తవుతాయా అనేది అందరిలో కలుగుతున్న సందేహాలు.
వరుసగా రెండు రీమేక్ సినిమాలతో హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్ మూడవ రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తమిళంలో వచ్చి సూపర్ హిట్ అయిన ‘వినోదాయ సితం’ తెలుగులో తన మేనల్లుడు సాయి ధరం తేజ్‌తో కలిసి చేయబోతున్నారు పవన్. ఒరిజినల్ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన సముద్రఖని రీమేక్ వెర్షన్‌కు దర్శకుడు.అయితే, పవన్ కళ్యాణ్ దీనికంటే ముందు క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు కంప్లీట్ చేయాల్సి ఉంది. కానీ, మళ్ళీ ఈ సినిమా షూటింగ్ హోల్డ్ పడిందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

Pawan Kalyan did not give clarity
Pawan Kalyan : ఏ సినిమా ఎప్పుడు పూర్తి చేస్తారో..?
దీని తర్వాత ఆయన చేయాల్సిన మరో సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్‌సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. కానీ, ఇంకా ఇది సెట్స్‌పైకే రాలేదు. ఇంతలోనే ‘వినోదాయ సితం’ కమిటయ్యారు. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్‌సింగ్ సినిమాల కంటే కూడా ‘వినోదాయ సితం’ తెలుగు రీమేక్‌ను పవన్ ముందు కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారట. దీని కోసం ఆయన 20 రోజులే డేట్స్ ఇచ్చారట. మొత్తం సినిమా టాకీ పార్ట్ 40 రోజుల్లోనే పూర్తి చేయమని చెప్పారట. మరి ఏ సినిమా ఎప్పుడు పూర్తి చేస్తారో, ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ మాత్రం అస్సలు రావడం లేదు.