Pawan kalyan : మహేష్ కథతో పవన్ కళ్యాణ్ రిస్క్ చేస్తున్నాడా..?

Authored By vamana sai | The Telugu News | Published on: June 6, 2021, 11:10 am

Pawan kalyan : మహేష్ సినిమా అంటే దాదాపు బ్లాక్ బస్టర్ హిట్ అని మైండ్ లో బ్లైండ్ గా ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్న సంగతి తెలిసిందే. అందుకు కారణం ఆయన ఎంచుకునే కథ..ఖచ్చితంగా ఫ్యాన్స్ ని మెప్పిస్తుందనే నమ్మకం. అలాంటి కథలనే మహేష్ బాబు జెడ్జ్ చేసి కమిటవుతుంటాడు. చాలా రేర్ గా మహేష్ సినిమా ఫ్లాపవుతుంది. అది ఏ హీరో విషయంలోనైనా సర్వసాధారణంగా జరిగేదే. ఇది మహేష్ లోపం కాదు..కొన్ని సార్లు అనుకున్న కథ సెట్స్ మీదకి వచ్చాక అనేక మార్పులు చోటుచేసుకుంటుంది. అందులో భాగంగా అనూహ్యంగా ఫ్లాప్ ని మూట కట్టుకుంది.

అయితే మహేష్ బాబు – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో గతంలో పోకిరి, బిజినెస్ మ్యాన్ సినిమాలొచ్చి భారీ హిట్స్ సాధించాయి. ముఖ్యంగా పోకిరి ఇండస్ట్రీ హిట్ సాధించింది. దాదాపు 75 ఏళ్ళ నుంచి ఉన్న రికార్డ్స్ మొత్తం బద్దలయ్యాయి. అంత భారీ హిట్ ఇచ్చిన పూరికి మహేష్ మూడవ సినిమా అంటే హ్యాట్రిక్ సినిమా మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. మహేష్ తో పూరి చేయాలనుకున్న కథ జనగణమన టైటిల్ తో తెరకెక్కించాలనుకున్నారు. ఇది పూరి డ్రీం ప్రాజెక్ట్. మహేష్ కోసమే ఈ కథ రాసినట్టు పబ్లిక్ గానూ చెప్పాడు. కానీ మహేష్ పూరికి షాకిచ్చాడు.

Pawan kalyan doing mahesh story

Pawan kalyan doing mahesh story

Mahesh : మహేష్ రిజెక్ట్ చేశాడంటే కథ బాగోలేకపోవడమే అని ఫిక్స్ అయ్యారు.

కథ నచ్చకపోవడంతో నో చెప్పాడు. అయితే ఇప్పుడు ఇదే కథను పవన్ కళ్యాణ్ Pawan kalyan తో పూరి చేయబోతున్నాడనే వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. దాంతో పవన్ అభిమానుల్లో టెన్షన్ మొదలైందంటున్నారు. మహేష్ రిజెక్ట్ చేశాడంటే కథ బాగోలేకపోవడమే అని ఫిక్స్ అయ్యారు. కానీ పూరి కథ కాబట్టి అది పవన్ కళ్యాణ్ Pawan kalyan హీరో కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇమేజ్ కి తగ్గ మార్పులు చేసుంటాడని కొందరు భావిస్తున్నారు. కానీ దీని మీద అఫీషియల్ గా అటు పవన్ గానీ, ఇటు పూరి గానీ స్పందించలేదు. పూరి ప్రస్తుతం లైగర్ తెరకెక్కిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఏకే రీమేక్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వీటి తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలున్నాయి. బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ సినిమా కమిటయ్యాడు. మరి పవన్ – పూరి కాంబోలో సినిమా ఉంటుందా అనేది కాలమే నిర్ణయించాలి.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp