
Pawan Kalyan himself had to give clarity
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా నటుడిగా, రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ప్రజలకు చాలా దగ్గరగా ఉంటున్నారు. ఎక్కడికి అయిన పవన్ వెళ్లాడంటే ఆయన కోసం అభిమానులు భారీగా తరలివస్తుంటారు. మత్స్య కార్మికుల హక్కుల కోసం ఇవాళ నరసాపురం లో పవన్ కళ్యాణ్.. బహిరంగ సభలో పాల్గొన్నారు. అంతకముందు హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్లారు. అక్కడ నుండి కాన్వాయ్‌లో నరసాపురం వెళ్లారు. అయితే ఆ సమయంలో ఓ అభిమాని పవన్ వైపుకు దూసుకురావడంతో కింద పడిపోయాడు. పెద్ద ప్రమాదం నుండే ఆయన బయటపడ్డాడు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకార వర్గం ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనంతో ఉంది. దీంతో వారి తరపున పోరాడేందుకు జనసేన సిద్ధమైంది. మత్స్యకారులకు అండగా ఉంటామని సభ వేదికగా పవన్ వారికి హామీ ఇవ్వనున్నారు.అయితే వేదిక వద్దకు వెళ్లే సమయంలో కారు పైన నిలుస్తున్న పవన్ ను ఒక్కసారిగా వెనకనుంచి వచ్చి పట్టుకోబోయాడు అభిమాని. అది చూసిన బాడీగార్డ్ అభిమాని ని కిందకు లాగాడు. ఆ సమయంలో పవన్ కింద పడ్డాడు. అయితే మళ్ళీ వెంటనే లేచి నిల్చొని ముందుకు సాగాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
pawan kalyan escapes from big accident
నేటి సభ తర్వాత రేపు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొననున్నారు.ఈ కార్యక్రమంకి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరు కానున్నారు.. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకుడు. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కి ఇది రీమేక్. పవన్ జోడీగా నిత్యామీనన్, రానా దగ్గుబాటి జోడీగా సంయుక్తా మీనన్ నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు, రైటర్ త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లేతో పాటు ఓ పాట కూడా రాయడం విశేషం. ఫిబ్రవరి 25న చిత్రం విడుదల కానుంది. చిత్ర ట్రైలర్ కూడా రేపు విడుదల చేయనున్నారు.
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
CBN warning to YS Jagan : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…
This website uses cookies.