Farmer : ఆదిలాబాద్ జిల్లాలోని ముగ్గురు పేద రైతుల ఖాతాల్లో రూ.కోట్లు జమయ్యాయి. కానీ ఈ విషయంలో వారు అమాయకంగా ఉండటంతో వారి ఏటీఎం కార్డుల నుంచి కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వాహకుడు రూ.కోటి 28 లక్షలు డ్రా చేశాడు. దీంతో తమ బ్రాంచ్ నుంచి డబ్బులు భారీగా డ్రా అయ్యాయనే విషయం తెలుసుకున్న బ్యాంక్ అధికారులు.. రైతుల వద్దకు వెళ్లి వాటిని రికవరీ చేససేందుకు ట్రై చేశారు. దీంతో అసలు విషయంబయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడ పంచాయతీలోని సల్పలగూడ గ్రామానికి చెందిన రైతులకు ఆదిలాబాద్ పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి.
వాటిలో రైతులు భీంరావు, రాంబాయి, గంగాదేవికి కిసాన్ క్రెడిట్ కార్డులున్నాయి. వాటి నుంచి రూ.1,28,78,000 డ్రా అయినట్లు ఇటీవల బ్యాంక్ అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ కార్డు ద్వారా సుమారు రూ.2 లక్షల వరకే పరిమితి ఉంటుంది.విత్‌డ్రా అయిన డబ్బులను రికవరీ చేసేందుకు చీఫ్ మేనేజర్ తన సిబ్బందితో కలిసి ఇటీవల రైతుల వద్దకు వెళ్లారు. వారిన ఆరా తీయగా ఆ డబ్బులు తాము డ్రా చేయలేదని వారు చెప్పారు. అంత డబ్బు తాము డ్రా చేయలేదని మామిడిగూడ సీఎస్పీ నిర్వాహకుడు నుంచి విడతల వారీగా మొత్తం రూ.16.20 లక్షలు తీసుకున్నట్టు చెప్పారు.
మిగిలిన రూ.1,12,58,000 సీఎస్పీ నిర్వాహకుడు రైతుల పేరుతో డ్రా చేసుకున్నాడని బ్యాంకు మేనేజర్ వెల్లడించారు. ఈ మొత్తం నాలుగు నెలలుగా డ్రా చేయడంతో తాము ఏ ఖాతా నుంచి డబ్బులు డ్రా అవుతున్నాయో తెలుసుకోలేకపోయినట్లు వెల్లడించారు. ఇక సీఎస్పీ నుంచి ఇప్పటికే రూ.30 లక్షలు రికవరీ చేసిన అధికారులు.. రైతుల కిసాన్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. మిగతా డబ్బులను చెల్లించేందుకు రైతులు అంగీకరించడంతో పోసులకు ఫిర్యాదు చేయలేదని మేనేజర్ తెలిపారు. అయితే డబ్బులు ఆ ఖాతాల్లోకి ఎలా జమయ్యయనే విషయంపై బ్యాంక్ అధికారులు స్పందించలేదు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.