Pawan Kalyan : పవన్ కళ్యాణ్ షూటింగ్ లో జాయిన్ అయ్యేది ఎప్పుడు?
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరిలో విడుదల అవుతుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతుంది. పరిస్థితులు ఫిబ్రవరి చివరి వరకు నార్మల్ అయ్యే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. కనుక భీమ్లా నాయక్ ఖచ్చితంగా ఫిబ్రవరి లోనే విడుదల అవుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని కొందరు మాత్రం భీమ్లా నాయక్ మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ అభిప్రాయం ను కలిగి ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మరో వైపు పవన్ హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ లో మళ్లీ ఎప్పుడు జాయిన్ అవుతాడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా చిత్రీకరణ సగం వరకు పూర్తి అయ్యింది. ఈ సినిమా కోసం మరో 30 నుండి 40 రోజుల పాటు పవన్ కళ్యాణ్ డేట్లు కేటాయించాల్సి ఉంది. కరోనా వరుస వేవ్ ల కారణంగా సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ సినిమా చిత్రీకరణ పునః ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి రెండవ లేదా మూడవ వారం నుండి రెగ్యులర్ గా హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాన్ జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వార సినిమా ను ముగిసే వరకు కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తారని సమాచారం అందుతోంది.
pawan kalyan hari hara veeramallu movie shooting re start date
pawan kalyan : హరి హర వీరమల్లు పై అంచనాలు భారీగా ఉన్నాయి
పవన్ కళ్యాణ్ పీరియాడిక్ నేపథ్యం లో మొదటి సారి నటిస్తున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. దర్శకుడు క్రిష్ ఇలాంటి పీరియాడిక్ సినిమాలను తెరకెక్కించడం లో సిద్ద హస్తుడు. అందుకే ఆయన ఈ సినిమా ను పవన్ తో అద్బుతంగా తెరకెక్కిస్తాడని అంతా అంటున్నారు. ఈ సినిమా లో పవన్ కు జోడీగా ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా లో ఒక విదేశీ ముద్దుగుమ్మ నటించాల్సి ఉంది. ఒక బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోగా ఆమె కోర్టు కేసుల్లో చిక్కుకుంది. దాంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను నటింపజేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.