telugu film producers angry on pawan kalyan due to his movie commitments
Pawan Kalyan : పవర్ స్టార్ అంటే అంతే..షాకులు, ట్విస్టులు తప్పవు భరిచాల్సిందే..! అని ఇప్పుడే కాదు ఇప్పటికే చాలాసార్లు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన జల్సా సినిమాలోనూ త్రివిక్రం ఓ డైలాగ్ రాశారు. ‘సంజు అడవి..రోజుకో సర్‌ప్రైజ్ ఇస్తాడు చచ్చేదాకా’..అని. అలాగే, పవర్ స్టార్ కూడా సర్‌ప్రైజులిస్తూనే ఉంటారు. ఎప్పటికీ. కానీ, అవి ఒక్కోసారి, షాకులు, ట్విస్టులుగానూ ఉంటాయి. అదే స్పెషాలిటీ. మూడేళ్ళ తర్వాత సినిమాలను చేస్తున్నా అంటూ అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చిన పవన్ వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టారు.
అయితే, ఆ సినిమాల ఆర్డర్ మాత్రం ఎప్పటికప్పుడు మారిపోతూ వస్తోంది. దాంతో ఆయనతో సినిమా చేయాలని ఎదురుచూస్తున్న దర్శక, నిర్మాతలు అలా ఎదురుచూస్తూనే ఉండాల్సి వస్తోంది. వాస్తవంగా వకీల్ సాబ్ తర్వాత పవన్ నుంచి రావాల్సిన సినిమాలు హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్‌సింగ్. కానీ, మధ్యలో మలయాళ రీమేక్ సినిమా భీమ్లా నాయక్ కమిటవడంతో వీరమల్లు ఆర్డర్ మారింది. అంతేకాదు, దాదాపు 15 నెలలు షూటింగ్ ఆగిపోయింది. మళ్ళీ మే మొదటివారం నుంచి సెట్స్ మీదకు వచ్చి శరవేగంగా షూటింగ్ సాగుతోంది.
Pawan Kalyan is all about twists
అయితే, దీని తర్వాత సెట్స్ మీదకి రావాల్సిన సినిమా భవదీయుడు భగత్‌సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవలే హరీష్ శంకర్ కూడా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే, తాజా సమాచారం మేరకు
భవదీయుడు సెట్స్ మీదకు రావడానికి ఇంకా సమయం పడుతుందట. పవన్ కళ్యాణ్ తమిళ హిట్ సినిమా వినోదాయ సితం చేసేందుకు కమిటవడమే దీనికి కారణం అని తెలుస్తోంది. ఇందులో సాయి ధరం తేజ్ కూడా నటిస్తున్నాడు. అందుకేనేమో సోషల్ మీడియాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో
హరీష్ శంకర్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి పూర్తిగా క్లారిటీ ఎప్పుడొస్తుందో.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.