Pawan Kalyan : ఒకే వేదికపై పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు… మామూలుగా ఉండదు మరి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : ఒకే వేదికపై పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు… మామూలుగా ఉండదు మరి..

 Authored By mallesh | The Telugu News | Updated on :19 February 2022,2:00 pm

Pawankalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెబితేనే టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డులు బద్దలవుతాయి. మూవీస్ పరంగా కాకుండా ఆయన వ్యక్తిత్వానికి చాలా మంది ఫ్యాన్ ఉన్నారు. ఆయన ఎన్ని హిట్స్ అందుకున్న, ఫ్లాప్స్ అందుకున్న ఫ్యాన్స్ సంఖ్య తగ్గడం అంటూ ఉండదు. మరి ఈ పవర్ స్టార్ ఫిబ్రవరి 25న థియేటర్స్ లోకి వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన భీమ్లా నాయక్ మూవీని రిలీజ్ చేసే పనిలో చాలా బిజీగా ఉన్నాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్.. తన సొంత కష్టంపైనే పైకొచ్చాడని చెప్పాలి.

తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం వంటి మూవీలు చేశాడు. 1998లో ఆయన యాక్ట్ చేసిన తొలప్రేమ మూవీ అప్పట్లో ఓ సంచలనం అని చెప్పాలి. ఆ తర్వాత వరుసగా తమ్ముడు, బద్రి, ఖుషి వంటి మూవీస్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. తర్వాత ఆయన మూవీస్ అంతగా ఆడలేదు. అయినప్పటికీ ఆయన ఫ్యాన్స్ పెరుగుతూ వచ్చారు. ఇక 2012లో గబ్బర్ సింగ్ మూవీతో పవన్ స్టార్ తన స్టామినాను మరో సారి నిరూపించుకున్నారు. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.తాజాగా ఆయన భీమ్లా నాయక్ పై పూర్తిగా ఫోకస్ పెట్టారు.

Pawan Kalyan Mahesh Babu on the same stage

Pawan Kalyan Mahesh Babu on the same stage

Pawankalyan : చీఫ్ గెస్ట్ గా మహేశ్ బాబు

దాదాపుగా షూటింగ్ తో సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 25న ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నది. దీని కంటే ముందే ప్రీ రిలీజ్ వేడుకలకు ఈ మూవీ సిద్ధమవుతోంది. ఇందుకు చీఫ్ గెస్ట్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు వస్తున్నారని టాక్. ఆయనతో పాటు దర్శకధీరుడు రాజమౌళి, మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ సైతం హాజరుకానున్నారట. మరి పవర్ స్టార్, సూపర్ స్టార్ ఒకే వేదికపైకి వస్తే వారిని చూడటానికి ఫ్యాన్స్ కు రెండు కళ్లు చాలవనే చెప్పాలి. మహేశ్ బాబు సైతం ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ పనుల్లో చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది