Home » Entertainment » Pawan Kalyan May Be Going To Leave Movies Soon
Entertainment

Pawan Kalyan : మెగా ఫ్యాన్స్‌కి బిగ్ షాక్.. ప‌వ‌న్ సినిమాలు వదిలేస్తున్నాడా?

Authored By
Sam C
The Telugu News | Published on: August 15, 2022, 10:00 pm
Advertisement

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. ఈ పేరు చెబితే అభిమానులు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. ఆయ‌న‌ని కేవ‌లం సినిమాల‌తోనే కాకుండా సామాజిక దృక్ప‌థం ఉన్న నేప‌థ్యంలో ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటారు. ప‌వ‌న్ కి ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా కూడా ఆయ‌న క్రేజ్ త‌గ్గ‌దు. అయితే రాజ‌కీయాల వ‌ల‌న ప‌వ‌న్ కొన్నాళ్లు సినిమాల‌కు దూరంగా ఉండి వ‌కీల్ సాబ్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ప్ర‌స్తుతం సినిమాలు చేస్తూనే రాజ‌కీయాల‌పై దృష్టి పెడుతున్నారు. ప‌వ‌న్ న‌టించిన హరి హర వీరమల్లు సెట్స్ పై ఉండగా… మరో రెండు మూడు చిత్రాలు ప్రకటించారు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఎక్కువ సమయం రాజకీయ కార్యక్రమాలకే కేటాయిస్తున్నారు.
ప‌వ‌న్ ఏం చేయ‌బోతున్నాడు..

Advertisement

రెండు జాతీయ మీడియా సంస్థలు జరిపిన సర్వేల్లో జనసేన పార్టీ ప్రస్తావనే లేకుండా పోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 18, టీడీపీకి 7 ఎంపీ సీట్లు వస్తాయని ఇండియా టుడే సర్వే తేల్చింది. మరో జాతీయ మీడియా వైసీపీకి 19, టీడీపీకి 6 ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. సదరు మీడియా సంస్థల సర్వే ప్రకారం… వైఎస్ జగన్ 120 నుండి 130 అసెంబ్లీ స్థానాలు గెల్చుకొని రెండోసారి అధికారం చేపట్టడం ఖాయం. అయితే జ‌న‌సేన ప‌రిస్థితి దారుణంగా మారింది. ఈ క్ర‌మంలో జనాల్లో విశ్వసనీయత సాధించాలని పవన్ భావించే అవకాశం కలదు. ఈ క్రమంలో ఆయన మధ్యలో ఉన్న చిత్రాలతో పాటు ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేసే ఆలోచన చేయకపోవచ్చు.

Pawan Kalyan May Be Going To Leave Movies Soon

Advertisement

2024 లోపు పవన్ నుండి సినిమా రావడం కష్టమే, ఆయన తీరిక లేకుండా రాజకీయాల్లో తలమునకలు అవుతాడని కొందరు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 5 నుండి బస్సు యాత్ర చేస్తున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్ షూటింగ్స్ కి హాజరయ్యే ఛాన్స్ లేదు. మొత్తంగా ప్రస్తుత సమీకరణాలు పరిశీలిస్తే.. పవన్ సినినిమాలకు దూరమవుతారని అనిపిస్తుంది. హ‌రి హర వీరమల్లు మ‌ధ్య‌లోనే ఆగింది. భవదీయుడు భగత్ సింగ్ సినిమా కూడా అలానే ఉంది. ఓ రీమేక్ చిత్రానికి కూడా ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇంత బిజీ షెడ్యూల్‌లో ప‌వ‌న్ ఏం చేయ‌బోతున్నాడ‌నేది సందిగ్ధంగా మారింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి