YS Jagan Key Announcement On Three Capitals On 15th Aug
YS Jagan : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అది కూడా 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని దేశమంతా వజ్రోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తన స్వాతంత్ర్య వేడుకల ఉపన్యాసంలో మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్..
ఈసందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 13 జిల్లాలను మరో 13 జిల్లాలుగా.. మొత్తం 26 జిల్లాలుగా ఏపీని విభజించామని చెప్పుకొచ్చారు. అలాగే రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణ తమ విధానం అన్నారు.
YS Jagan Key Announcement On Three Capitals On 15th Aug
పరిపాలన వికేంద్రీకరణే తమ విధానం అని… రాజధాని స్థాయిలోనే పరిపాలన వికేంద్రీకరణ ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. అలాగే.. ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మగౌరవానికి, సమతౌల్యానికి ఇదే పునాది అన్నారు. ఆ దిశగా తాము అడుగులు వేస్తున్నామన్నారు.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి మన దేశం ప్రతీక అని, పింగళి వెంకయ్య రూపొందించిన జెండా భారతీయుల గుండె అని తెలిపారు. ప్రపంచంలో పోటీ పడి మరీ మనం ప్రగతిని సాధిస్తున్నాం. ఆహార ధాన్యాల లోటును దేశం అధిగమించింది. ఫార్మా రంగంలోనే ప్రపంచంలోనే భారత్ టాప్ ప్లేస్ లో ఉంది. ప్రపంచానికే ఇప్పుడు మనం అవసరమైన ఔషధాలను అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.