
Pawan Kalyan new target for producers
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనేది ప్రతీ దర్శకనిర్మాతకు ఓ పెద్ద కల. అయితే, పవన్ రాజకీయాలలోకి వెళ్ళనంతవరకు సినిమాలు తప్ప మరో లోకం లేకపోవడంతో నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చి కూడా హాయిగా నిద్రపోయినవారున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు అలా కాదు..పవన్‌కి అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు ప్రాజెక్ట్ సెట్ చేసుకున్న దర్శకులకు నిద్రపట్టడం లేదట. ఆయన ఎప్పుడు సెట్స్‌లోకి వస్తారో..ఎప్పుడు రాజకీయాలంటూ వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి. దిల్ రాజు, ఏ ఎం రత్నం లాంటి వారే ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చి వెయిట్ చేస్తూ వచ్చారు. సెట్స్‌లోకి వచ్చారంటే చక చకా తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసేస్తారు.
కానీ, అక్కడివరకు రావడమే కష్టంగా మారింది. పవన్‌కు సినీ అభిమానులు కావాలి. రాష్ట్రంలోని ప్రజల కష్టాలను గట్టెక్కించడమూ చేయాలి. ఇలా రెండు పడవల ప్రయాణమే పవన్ నిర్మాతలను, దర్శకులను ఇబ్బంది పెడుతుంది. ఇప్పటికే, పూర్తి కావాల్సిన హరిహర వీరమల్లు షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చెప్పలేకపోతున్నారు. హరీష్ శంకర్ – మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో తెరకెక్కాల్సిన భవదీయుడు భగత్‌సింగ్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేకపోతున్నారు. ఇటీవల వినోదాయ సితం సినిమా తెలుగు రీమేక్ చేసేందుకు 40 రోజుల డెడ్ లైన్ పెట్టారు.
Pawan Kalyan new target for producers
ఎలాగైనా హరిహర వీరమల్లు, వినోదాయ సితం ఈ దసరా లోపు కంప్లీట్ చేయాలని దర్శకనిర్మాతలకు పవన్ టార్గెట్ పెట్టారట. దసరా తర్వాత ఎక్కువగా రాజకీయాల మీదే పవన్ దృష్టి పెట్టబోతున్నారు. అందుకే, ఈ లోపే ఈ రెండు సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారట. మరి ఇంత తక్కువ సమయమలో పీరియాడిక్ డ్రామా, తమిళ రీమేక్ కంప్లీట్ అవుతాయా లేదా అనేది కేవలం పవన్ కళ్యాణ్ మీదే ఆధారపడి ఉంది. ఇవి కాకుండా బండ్ల గణేష్ నిర్మాణంలో ఒక సినిమా, సురేందర్ రెడ్డి – రామ్ తాళ్ళూరి కాంబినేషన్‌లో కమిటైన సినిమాను పవన్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం, పవన్ ఉన్న పరిస్థితుల్లో రెండు ప్రాజెక్ట్సే పూర్తి చేస్తారేమో అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.