Pawan Kalyan : రెమ్యూనరేషన్ రూ.11 కోట్లువెనక్కు ఇచ్చిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. తాజాగా ‘ హరి హర వీర మల్లు ‘ సినిమా విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ చిత్రం కోసం నిర్మాత ఏఎం రత్నం నుంచి ముందుగా తీసుకున్న రూ.11 కోట్ల అడ్వాన్స్‌ను పవన్ కళ్యాణ్ తిరిగి ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రం తన కారణంగా ఆలస్యం అవ్వడంతో నిర్మాతకు బడ్జెట్ భారంగా మారిందని భావించిన పవన్, ఆర్ధికంగా సహాయం చేయాలని ముందుకొచ్చారు.
Pawan Kalyan : రెమ్యూనరేషన్ రూ.11 కోట్లువెనక్కు ఇచ్చిన పవన్ కళ్యాణ్
‘హరి హర వీర మల్లు’ సినిమా గత కొంతకాలంగా నిర్మాణ దశలోనే ఉండటంతో, విడుదలలో అనేక మార్లు జాప్యం జరిగింది. తాజాగా చిత్రబృందం జూన్ 12న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించినా, ఇప్పటికీ VFX మరియు గ్రాఫిక్స్ పనులు పూర్తి కాకపోవడం వల్ల మళ్లీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికితోడు, జూన్ 9న తిరుపతిలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వాయిదా పడింది. దీంతో సినిమా విడుదలపై స్పష్టత లేకుండా పోయింది.
ఇలాంటి సంక్లిష్ట సమయంలో నిర్మాత రత్నానికి ఆర్ధిక భారం లేకుండా ఉండాలని పవన్ తీసుకున్న నిర్ణయం అభిమానులనే కాకుండా ఇండస్ట్రీ జనాల మన్ననలు అందుకుంటోంది. రెమ్యూనరేషన్‌ను వెనక్కు ఇచ్చే నిర్ణయం, నిర్మాతల పట్ల ఉన్న నిబద్ధతను పవన్ మరోసారి నిరూపించారు. చిత్రానికి సంబంధించిన పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి సహకరించేందుకు సిద్ధంగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రవర్తనను పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.