Pawan Kalyan : రెమ్యూనరేషన్ రూ.11 కోట్లువెనక్కు ఇచ్చిన పవన్ కళ్యాణ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : రెమ్యూనరేషన్ రూ.11 కోట్లువెనక్కు ఇచ్చిన పవన్ కళ్యాణ్

 Authored By ramu | The Telugu News | Updated on :5 June 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Pawan Kalyan : రెమ్యూనరేషన్ రూ.11 కోట్లు వెనక్కు ఇచ్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. తాజాగా ‘ హరి హర వీర మల్లు ‘ సినిమా విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ చిత్రం కోసం నిర్మాత ఏఎం రత్నం నుంచి ముందుగా తీసుకున్న రూ.11 కోట్ల అడ్వాన్స్‌ను పవన్ కళ్యాణ్ తిరిగి ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రం తన కారణంగా ఆలస్యం అవ్వడంతో నిర్మాతకు బడ్జెట్ భారంగా మారిందని భావించిన పవన్, ఆర్ధికంగా సహాయం చేయాలని ముందుకొచ్చారు.

Pawan Kalyan రెమ్యూనరేషన్ రూ11 కోట్లువెనక్కు ఇచ్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan : రెమ్యూనరేషన్ రూ.11 కోట్లువెనక్కు ఇచ్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan : నష్టాల్లో ఉన్న రత్నం కు పవన్ ఆర్ధిక సాయం

‘హరి హర వీర మల్లు’ సినిమా గత కొంతకాలంగా నిర్మాణ దశలోనే ఉండటంతో, విడుదలలో అనేక మార్లు జాప్యం జరిగింది. తాజాగా చిత్రబృందం జూన్ 12న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించినా, ఇప్పటికీ VFX మరియు గ్రాఫిక్స్ పనులు పూర్తి కాకపోవడం వల్ల మళ్లీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికితోడు, జూన్ 9న తిరుపతిలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కూడా వాయిదా పడింది. దీంతో సినిమా విడుదలపై స్పష్టత లేకుండా పోయింది.

ఇలాంటి సంక్లిష్ట సమయంలో నిర్మాత రత్నానికి ఆర్ధిక భారం లేకుండా ఉండాలని పవన్ తీసుకున్న నిర్ణయం అభిమానులనే కాకుండా ఇండస్ట్రీ జనాల మన్ననలు అందుకుంటోంది. రెమ్యూనరేషన్‌ను వెనక్కు ఇచ్చే నిర్ణయం, నిర్మాతల పట్ల ఉన్న నిబద్ధతను పవన్ మరోసారి నిరూపించారు. చిత్రానికి సంబంధించిన పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి సహకరించేందుకు సిద్ధంగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రవర్తనను పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది