Pithapuram : పవన్ పిఠాపురం వెళ్లేందుకు టైం ఫిక్స్... కాని అందరికి ఓ కండీషన్ పెట్టాడుగా..!
Pithapuram : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలో మారుమ్రోగిపోతుంది.రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాస్తా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకున్నారు. విపక్షనేతగా సక్సెస్ అయిన పవన్ ఇప్పుడు పాలకుడిగా తనదైన ముద్ర వేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. కూటమి విజయానికి ప్రధాన కారణంగా నిలిచిన జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు మరికొందరు విజేతలు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఇక శుక్రవారం సీఎం చంద్రబాబు తన కేబినెట్ మినిస్టర్స్ జాబితాను కూడా విడుదల చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. దీంతో ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తోన్న వీడియోను షేర్ చేస్తూ వస్తున్నారు. ఇక తనను అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతర జూన్ 20 తర్వాత పిఠాపురానికి వస్తానని చెప్పారు. ఈలోపు శాసనసభ సమావేశాలు కూడా ఉన్నాయని, వీటిని పూర్తి చేసుకుని పిఠాపురం వస్తానని పవన్ తెలిపారు. ఈ నెల 20తర్వాత పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తలను కలుస్తానని, ఆ తర్వాత దశల వారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పారు. తనను నేరుగా కలిసి అభిననందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారని, త్వరలోనే వారందరినీ కలిసి మాట్లాడతానని అన్నారు. అభినందనలు తెలియజేడానికి వచ్చేవారు పూల బోకేలు, శాలువాలు తీసుకురావద్దని పవన్ విజ్ఞప్తి చేశారు.
Pithapuram : పవన్ పిఠాపురం వెళ్లేందుకు టైం ఫిక్స్… కాని అందరికి ఓ కండీషన్ పెట్టాడుగా..!
ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. తన ఆనందాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్న ఆయన, కూటమి హామీలపై సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన అంశాన్ని పోస్టు చేశారు. 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ ఫైల్ మీద తొలి సంతకం. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండోసంతకం. సామాజిక పింఛన్లు 4 వేల రూపాయలకు పెంచుతూ మూడో సంతకం. అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ నాలుగో సంతకం. యువతలో నైపుణ్యాలు గురించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్ సెన్స్‌సపై ఐదో సంతకం చేశారు అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
This website uses cookies.