vakeel saab : కలెక్షన్లలో కొత్త రికార్డ్.. వకీల్ సాబ్ దెబ్బకు అందరూ షాక్
vakeel saab : పవర్ స్టార్ ఒక్కసారిగా బాక్సాఫీస్ మీద విరచుకుపడితే కథ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ అదిరిపోతాయి. అయితే వకీల్ సాబ్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కలెక్షన్ల విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. ఏపీలో స్పెషల్ షోలకు పర్మిషన్లు ఇవ్వకపోవడం, బెనిఫిట్ షోలు పడకపోవడంతో అంతా తారుమారైంది. అందుకే అధికారికంగా ఇంకా లెక్కలు బయటకు వదలడం లేదు మేకర్స్.
అయితే మొదటి రోజే వకీల్ సాబ్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 52 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల లెక్కలు పక్కన పెడితే ఓవర్సీస్‌లో మాత్రం వకీల్ సాబ్ దుమ్ములేపేశాడు. ఈ ఏడాది మొత్తంలో ఇప్పటి వరకు వకీల్ సాబే హయ్యస్ట్ అయ్యాడు. ఓవర్సీస్ మార్కెట్‌లో కరోనా ఉధృతి ఉన్నా కూడా వకీల్ సాబ్ చెలరేగిపోయాడు. ఇప్పటి వరకు విడులైన చిత్రాల్లో కేవలం ఒక్క జాతి రత్నాలు సినిమాయే వన్ మిలియన్ డాలర్లను రాబట్టింది.

Pawan kalyan vakeel saab crosses 500k dollars in Overseas
vakeel saab : కలెక్షన్లలో కొత్త రికార్డ్.. వకీల్ సాబ్ దెబ్బకు అందరూ షాక్
వన్ మిలియన్ మార్క్‌ను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. కానీ వకీల్ సాబ్ మాత్రం రెండు రోజుల తిరక్కుండానే హాఫ్ మిలియన్ డాలర్లను కొల్లగొట్టేశాడు. రెండో రోజు ముగియకముందే 500K డాలర్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ లెక్కన వన్ మిలియన్ మార్క్‌ను ఇంకో రెండు రోజుల్లోనే క్రాస్ చేయనుందన్న మాట. ఇలా వకీల్ సాబ్ ఓవర్సీస్‌లోనే దుమ్ములేపుతోందంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తోందని తెలుస్తోంది.