Hyper Aadi : హైప‌ర్ ఆదికి దిమ్మ‌తిరిగే ఆఫ‌ర్ ఇచ్చిన ప‌వన్ క‌ళ్యాణ్‌.. క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌డు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyper Aadi : హైప‌ర్ ఆదికి దిమ్మ‌తిరిగే ఆఫ‌ర్ ఇచ్చిన ప‌వన్ క‌ళ్యాణ్‌.. క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌డు..!

 Authored By ramu | The Telugu News | Updated on :28 June 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Hyper Aadi : హైప‌ర్ ఆదికి దిమ్మ‌తిరిగే ఆఫ‌ర్ ఇచ్చిన ప‌వన్ క‌ళ్యాణ్‌.. క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌డు..!

Hyper Aadi : బుల్లితెరపై తిరుగులేని షోగా ఉన్న జబర్ధస్త్ ద్వారా మంచి క్రేజ్ ద‌క్కించుకున్న న‌టుడు హైప‌ర్ ఆది. ఈ షో ద్వారా ఎంతో మంది క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటి వారిలో హైపర్ ఆది ఒకడు. తనదైన పంచులు, ప్రాసలతో మెప్పించిన హైప‌ర్ ఆది తక్కువ సమయంలోనే స్టార్‌గా మారాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఇలా ఇప్పటికే టెలివిజన్ రంగంలో ఎన్నో షోలలో సందడి చేశాడు. సినిమాల‌లో కూడా న‌టిస్తూ అల‌రిస్తున్నాడు. చాలా చిత్రాల‌లో ఫ్రెండ్ పాత్రలు పోషించి మెప్పించాడు. ‘ఆటగదరా శివ’ అనే మూవీలో హీరోగా చేశాడు. ఇక, అల్లరి నరేష్ ‘మేడ మీద అబ్బాయి’ అనే సినిమాకు డైలాగ్స్ ఇచ్చాడు. ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తూ జోష్‌తో వెళ్తున్నాడు.

Hyper Aadi గోల్డెన్ ఛాన్స్..

ఈ మధ్య కాలంలో పాలిటిక్స్‌కు సంబంధించిన స్పీచ్‌లు ఇస్తూ తనదైన రీతిలో సత్తా చాటుతోన్న హైపర్ ఆది.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అతడు జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు, జూలై మొదటి వారంలోనే అతడు ఆ పార్టీ కండువా కప్పుకుంటాడని అంటున్నారు. అంతేకాకుండా పార్టీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డ హైప‌ర్ ఆదికి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్సీ పదవిని అప్పగిస్తున్నారట. ఇదంతా మరో రెండు వారాల్లోనే జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ న్యూస్ నిజమే అయితే హైపర్ ఆది పంట పడినట్లే అంటున్నారు.

Hyper Aadi హైప‌ర్ ఆదికి దిమ్మ‌తిరిగే ఆఫ‌ర్ ఇచ్చిన ప‌వన్ క‌ళ్యాణ్‌ క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌డు

Hyper Aadi : హైప‌ర్ ఆదికి దిమ్మ‌తిరిగే ఆఫ‌ర్ ఇచ్చిన ప‌వన్ క‌ళ్యాణ్‌.. క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌డు..!

2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. దీనిలో భాగం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేశాయి. జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగిన హైపర్ ఆది విస్తృతంగా ప్రచారం చేశాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో హైపర్ ఆది రోజుల తరబడి ప్రచారం చేశాడు. దాదాపు నెల రోజులు అక్కడే ఉండి ఇంటింటికి ప్రచారం నిర్వహించాడు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. హైపర్ ఆదితో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్స్ పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయ‌డం మనం చూశాం. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ఋణం తీర్చుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది