Payal Rajput : తాబేలుతో పోటీ ప‌డుతున్న పాయ‌ల్ రాజ్‌పుత్.. యానిమ‌ల్స్‌తో స‌ర‌దాగా…

Authored By Sam C | The Telugu News | Published on: March 2, 2022, 1:30 pm

Payal Rajput : ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియా వాడ‌కం తెగ పెరిగింది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు కూడా తెగ యాక్టివ్‌గా ఉంటూ ఆస‌క్తిక‌ర విష‌యాలు షేర్ చేస్తున్నారు. క్యూట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఏ రేంజ్‌లో వాడుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు సాదాసీదాగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకోవడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకుంది. దీంతో మరింత ఉత్సాహంగా ప్రేక్షకులను అలరిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. తాజాగా పాయ‌ల్ రాజ్‌పుత్ ఓ జూకి వెళ్లి అక్క‌డ జంతువుల‌తో తెగ సంద‌డి చేసింది.

తాబేలులా పాకడంతో పాటు జిరాఫీల‌కు ఫుడ్ పెడుతూ తెగ సంద‌డి చేసింది పాయ‌ల్‌. ఎక్క‌డ‌కి వెళ్లిన ఈ అమ్మ‌డి రచ్చ ఓ రేంజ్‌లో ఉండ‌డం ఖాయ‌మ‌ని నెటిజ‌న్స్ అంటున్నారు. పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ, కన్నడలో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా తమిళంలో నటించిన ‘గోల్ మాల్’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఫొటోషూట్లతో సినిమా ప్రమోషన్ చేసుకుటోంది. వైవిధ్య‌మైన డ్రెస్సుల‌లో ఫొటో షూట్స్ చేస్తూ తెగ ర‌చ్చ చేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌. పాయ‌ల్ ఏ పిక్ షేర్ చేసిన నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంటుంది.

payal rajput enjoys with animals

payal rajput enjoys with animals

Payal Rajput : పాయ‌ల్ సంద‌డి మాములుగా లేదు..

పాయ‌ల్ ఆర్ఎక్స్ 100 చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ : కథానాయకుడు, సీతా, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామా, డిస్కో రాజా వంటి మూవీల్లో నటించి తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, కన్నడలో వరుస సనిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా గోల్ మాల్’ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రంలో నటించింది పాయల్. ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా జీవా, మిర్చి శివ, పాయల్ రాజ్‌పుత్ మరియు తాన్య నటించారు. రజనీకాంత్ రచయిత కాగా కన్నడ చిత్రం చారులత దర్శకుడు పొన్ కుమారన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

Sam C

No bio available for this author.

  1. "Driving Licence : మొబైల్ నంబర్ అప్డేట్ చేయకపోతే లైసెన్స్ క్యాన్సిల్ అవుతుందా..?"

  2. "Bathing Dinner : భోజనం చేసిన వెంటనే వేడి నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది? నిజం ఇదే"

  3. "Radhika Apte : 41 ఏళ్లలోనే నా శరీరం, కోరికలపై అసలైన క్లారిటీ వచ్చింది: రాధికా ఆప్టే"

  4. "Yanamala Krishnudu : టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనలోకి మాజీ ప్రత్యర్థులు.. కాకినాడ రాజకీయాల్లో కొత్త లెక్కలు"

  5. "Vangaveeti Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం చుట్టూ ముదురుతున్న రచ్చ.. జనసేన-వైసీపీ మధ్య మైండ్‌గేమ్స్..!"

  6. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  7. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp