Payal Rajput : పాయ‌ల్ రాజ్‌పుత్‌ని టాలీవుడ్ నుండి బ్యాన్.. అంత త‌ప్పు ఏం చేసింది..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Payal Rajput : పాయ‌ల్ రాజ్‌పుత్‌ని టాలీవుడ్ నుండి బ్యాన్.. అంత త‌ప్పు ఏం చేసింది..?

Payal Rajput : అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మైన అందాల ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్. ఈ అమ్మ‌డు తొలి సినిమాతోనే ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆకట్టుకుంది. ఈ సినిమా త‌ర్వాత పాయ‌ల్‌కి మ‌ళ్లీ ఆ రేంజ్ విజ‌యం ద‌క్క‌లేదు. అయితే ఇటీవల ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతితో చేసిన ‘మంగళవారం’ చిత్రం పాయల్‌కి మళ్లీ హిట్ తెచ్చిపెట్టింది. దీంతో ప్రస్తుతం మంచి జోష్‌లో ఉంది ఈ బ్యూటీ. అయితే ఈ […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 May 2024,11:10 am

ప్రధానాంశాలు:

  •  Payal Rajput : పాయ‌ల్ రాజ్‌పుత్‌ని టాలీవుడ్ నుండి బ్యాన్.. అంత త‌ప్పు ఏం చేసింది..?

Payal Rajput : అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మైన అందాల ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్. ఈ అమ్మ‌డు తొలి సినిమాతోనే ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆకట్టుకుంది. ఈ సినిమా త‌ర్వాత పాయ‌ల్‌కి మ‌ళ్లీ ఆ రేంజ్ విజ‌యం ద‌క్క‌లేదు. అయితే ఇటీవల ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతితో చేసిన ‘మంగళవారం’ చిత్రం పాయల్‌కి మళ్లీ హిట్ తెచ్చిపెట్టింది. దీంతో ప్రస్తుతం మంచి జోష్‌లో ఉంది ఈ బ్యూటీ. అయితే ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర పోస్ట్ చేసి వార్త‌ల‌లోకి ఎక్కింది. త‌న‌ని నిర్మాత‌లు బెదిరిస్తున్నారంటూ వాపోయింది

Payal Rajput పాయ‌ల్‌కే బెదిరింపులా..

2019-2020 సమయంలో నేను ‘రక్షణ’ అనే సినిమా ఒప్పకున్నాను. ముందుగా ఆ చిత్రానికి ‘5Ws’ అనే టైటిల్ అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. కానీ రీసెంట్‌గా నాకు దక్కిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ చిత్రాన్ని ఇప్పుడు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే అగ్రిమెంట్‌ ప్రకారం నాకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్‌ ఇంకా క్లియర్ చెయ్యలేదు. అయినా నన్ను సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఒత్తిడి చేస్తున్నారు.” అంటూ పాయల్ చెప్పింది. నాకు వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా ఇవ్వలేదు, అంతే కాకుండా ప్రమోషన్స్ కి రమ్మని అడుగుతున్నారు. నా టీమ్ వాళ్ళతో మాట్లాడారు.

Payal Rajput పాయ‌ల్ రాజ్‌పుత్‌ని టాలీవుడ్ నుండి బ్యాన్ అంత త‌ప్పు ఏం చేసింది

Payal Rajput : పాయ‌ల్ రాజ్‌పుత్‌ని టాలీవుడ్ నుండి బ్యాన్.. అంత త‌ప్పు ఏం చేసింది..?

కానీ వాళ్ళు నన్ను టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామని భయపెడుతున్నారు. నా టీం రక్షణ సినిమా డిజిటల్ ప్రమోషన్స్ కి వస్తాము, నాకు ఇవ్వాల్సిన బాకీ క్లియర్ చేస్తే అని చెప్పినా కూడా వినట్లేదు. నా పేరుని డ్యామేజ్ చేసే విధంగా వాడుతున్నారు. ఇటీవల జరిగిన మీటింగ్స్ లో అసభ్య పదజాలం వాడారు. నాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వకుండా సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నందుకు నేను ఇప్పుడు లీగల్ గా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను అని పోస్ట్ చేసింది. మ‌రి ఈ వివాదం ఎలా సాల్వ్ అవుతుందో చూడాల్సి ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది