Vastu Tips : ఇలాంటి తాబేలు మీ ఇంట్లో ఉందా… ఉంటే ఈ తప్పులు అసలు చేయకండి…?
ప్రధానాంశాలు:
Vastu Tips : ఇలాంటి తాబేలు మీ ఇంట్లో ఉందా...ఉంటే ఈ తప్పులు అసలు చేయకండి...?
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే శుభప్రదంగా పరిగణిస్తారు. అలాగే కొన్ని వస్తువులు ఇంట్లో ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది.అలాగే కొన్ని వస్తువులను ఇంట్లో ఏ ప్రదేశంలో ఉంచితే మంచిదో,ఎక్కడ ఉంచకూడదు కూడా వాస్తు శాస్త్రం చెబుతుంది. అలాంటి వస్తువే తాబేలు. తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే శుభప్రదంగా పరిగణిస్తారు. తాబేలు బొమ్మతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తమ అంచనాల ద్వారా తెలియజేశారు. బెడ్ రూమ్లో తాబేలు బొమ్మ పెట్టుకుంటే, నిద్రలేని సమస్య ఉండదని అంటున్నారు.అంతేకాదు, తాబేలు బొమ్మ ఇంట్లోకి సంపదలను శక్తి డబ్బు శ్రేయస్సులను తెస్తుంది. కానీ అయితే మీ ఇంట్లో గాజు లేదంటే, క్వార్ట్స్ తో చేసిన తాబేలు ఏ దిశలో ఉంచితే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం…

Vastu Tips : ఇలాంటి తాబేలు మీ ఇంట్లో ఉందా… ఉంటే ఈ తప్పులు అసలు చేయకండి…?
Vastu Tips వాస్తు శాస్త్రం తాబేలు గురించి ఏం చెబుతుంది
శాస్త్రం ప్రకారం ఇంట్లో గాజు తాబేలు ఉంచితే అది శుభప్రదంగా పరిగణించడం జరిగింది. గాజులేదా క్రీస్టల్ తాబేలు బొమ్మను, వాయువ్యం లేదా నైరుతి దిశలో పెట్టుకుంటే విజయం అదృష్టం సంపద లభిస్తుందని నమ్ముతారు. క్వార్ట్స్ లేదా ఇయర్ గ్లాస్ తో చేసిన తాబేలును ఆగ్నేయంలో పెట్టుకుంటే ఇంట్లో ప్రతికూల శక్తి తగ్గుతుంది,అని వాస్తు జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. ఉత్తరాభిముఖంగా ఉన్న ఇంట్లో పచ్చిమ దిక్కున తాబేలు బొమ్మ పెట్టుకుంటే, అది కోరికలు నెరవేరుస్తుందని చెబుతున్నారు. ఆఫీసు లేదా వర్క్ ప్లేస్లలో పెట్టుకుంటే, అధిక రాబడి వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తుందని చెబుతారు.
అభివృద్ధి నిలిచిపోయిన వారు నైరుతిలో ఇత్తడి తాబేలును ఉత్తరాభిముఖంగా ఉంచాలి. ఇది ఆర్థిక అభివృద్ధికి మంచిది రకరకాల సైజుల్లో కొన్ని తాబేలు బొమ్మలు నైరుతిలో పెట్టుకున్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య బంధువుల మధ్య సామరస్యం ఉంటుంది ఇత్తడి తాబేలు పిల్లల స్టడీ టేబుల్ మీద పడమర వైపు ఉంచితే చదువులో వారికి ఏకాగ్రత పెరుగుతుంది. ముఖంగా, ఉండే తాబేలు బొమ్మ ఇంటి మధ్యలో ఉంటే,సహజంగా పట్టుదల పెరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు వెండి తాబేలును వెండి గిన్నెలో నీళ్లలో ఉంచితే మంచి అవకాశాలు మాత్రమే కాదు. డబ్బు కూడా సమకూరుతుందని అంటున్నారు. తాబేలును నైరుతి దిశలో ఉంచాలి. ఈ గాజు తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని వ్యాపింప చేస్తుంది. ఇది ఆనందం శాంతి శ్రేయస్సు వెళ్లి విరుస్తుంది. జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.గాజు తాబేలు నీటిలో ఉంచడం వల్ల సంపదలను ఆకర్షిస్తుందంటున్నారు.