Kasthuri Shankar : నటి కస్తూరి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. అరెస్ట్‌కి రంగం సిద్ధం చేస్తున్న పోలీసులు
Kasthuri Shankar : వివాదాస్పద కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తలలో నిలిచే కస్తూరి తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకుంది.ఇటీవలే ఓ ప్రసంగంలో పాల్గొన్న ఆమె వేదిక మీద మాట్లాడుతూ.. అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు తెలుగు వారు తమిళనాడుకు వచ్చారని.. అలా వచ్చిన వారు ఇప్పుడు తమిళులుగా చలామణి అవుతూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు అంటూ కామెంట్ చేసింది. ఈ వ్యాఖ్యలను తమిళనాడులోని పలు తెలుగు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దీంతో అగ్గి రాజుకుంది. తమిళనాడులో పలు జిల్లాల్లో తెలుగు నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై ఎగ్మూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నై ఎగ్మూరు పోలీస్‌స్టేషన్‌లో నాలుగు సెక్షన్లతో ఆమె పై కేసులు నమోదయ్యాయి. దీంతో కస్తూరి అరెస్టుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది.
ఏ సమయంలో నైన పోలీసులు ఆమెను అరెస్టు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.మరోవైపు ఈ అంశంపై నటి కస్తూరి క్షమాపణ కోరారు. తెలుగు భాషతో ప్రత్యేక బంధం ఉండటం అదృష్టమన్నారు. తెలుగు ప్రజలు తనకు పేరు, ప్రతిష్ట, కుటుంబాన్ని ఇచ్చారని తెలిపారు. తాను మాట్లాడింది ప్రత్యేకించి కొందరి గురించేనని, తెలుగు ప్రజలందరినీ కాదని మళ్లీ ఒకసారి చెబుతున్నానన్నారు. తెలుగు కుటుంబాలను గాయపరచటం తన ఉద్దేశం కాదని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానన్నారు.నేను కుల, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జీవించాను. నేను నిజమైన జాతీయవాదిని. తెలుగు ప్రజలు నాకు పేరుతో పాటు ప్రేమ, కీర్తిని అందించారు. కొందరి వ్యక్తుల గురించి మాత్రమే నేను మాట్లాడానని గ్రహించగలరు. తెలుగు సమాజం మొత్తాన్ని ఉద్దేశిస్తూ నేను మాట్లాడలేదు. అనుకోని సంఘటనకు నన్ను క్షమించండి” అంటూ లేఖలో రాసింది.
Kasthuri Shankar : నటి కస్తూరి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. అరెస్ట్‌కి రంగం సిద్ధం చేస్తున్న పోలీసులు
ఇటీవలే రాజీయాల్లో ఎంట్రీ ఇచ్చారు కస్తూరి. కమలం పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకున్నారు. ట్విట్టర్ ఖాతా కోసమో.. ఇంగ్లీష్ పత్రికల కోసమో అప్పుడప్పుడూ సోషల్ ఇష్యూస్ మీద కాలమ్స్ రాస్తారు కూడా. తెలుగు టీవీ సీరియల్స్‌తో గ్లామర్ ఇండస్ట్రీలో లైమ్‌లైట్‌లోకొచ్చి.. రీల్సూ గట్రా చేస్తూ.. మళ్లీ ఫేమస్సయ్యారు. అలా వచ్చిన పాపులారిటీకి తనదైన నోటి దురుసు యాడైంది. ఇంకేముంది.. సీజనుకో స్టేట్‌మెంట్‌తో కాంట్రవర్సియల్ క్వీన్ అనే పేరు తెచ్చుకుంది కస్తూరి శంకర్.
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
This website uses cookies.