Pooja Hegde : కలర్ ఫుల్ డ్రెస్ లో పూజా హెగ్డే సోయగాలు.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది
Pooja Hegde: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. వరుసగా పూజా సినిమాలు ప్లాప్ అవుతున్నా క్రేజ్ మాత్రం అస్సలు తగ్గటంలేదు. తమిల్, తెలుగు, హిందీ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పూజా తెలుగులో ఒక లైలా కోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక అల్లుఅర్జున్ డీజే సినిమాతో ఫామ్ లోకి వచ్చింది. ఆ తర్వాత వరుస హిట్లతో సౌత్ లో టాప్ పొజీషన్ కి వెళ్లింది. రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాధేశ్యామ్, విజయ్ బీస్ట్, చిరంజీవి, రామ్ చరణ్ ల ఆచార్య మూవీలతో సందడి చేసింది.
ప్రస్తుతం త్రివిక్రమ్, మహేశ్ బాబు సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న కభీ ఈద్ కభీ దివాలి సినిమాలో కూడా నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే పూజ వరుస ఫొటో షూట్స్ తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. హాట్ హాట్ అందాలను స్కిన్ టైట్ డ్రెస్సుల్లో చూపిస్తూ మతిపోగొడతోంది. ఇక పూజ ఫిట్ నెస్ గురించి చెప్పక్కర్లేదు. ఫిట్ నెస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అందరికీ తెలిసిందే. తన ఫిట్ నెస్ కే అవకాశాలు తన్నుకుంటూ వచ్చేస్తాయి.
ఇక జిమ్ సెంటర్ల వద్ద జిమ్ వేర్ లో ఫొటోలకు ఫోజులిస్తున్న వీడియోలు నెట్టింట్టో వైరల్ అవుతుంటాయి. ఇక సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ ఆకట్టుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో 20 మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కాగా ప్రస్తుతం పూజా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. కేవలం గంటలోనే లక్షకు పైగా లైకులు వచ్చిపడ్డాయి. కలర్ ఫుల్ డ్రెస్ లో కురులను పట్టుకుని క్యూట్ గా చూస్తున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లు లవ్.. హాట్ సింబల్స్ పెడుతూ కామెంట్స్ పెడుతున్నారు.