ఆ పనికి ముందు ఇలా చేస్తా.. పూజా హెగ్డే వీడియో వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Updated on: January 4, 2021, 9:49 pm

టాలీవుడ్‌లో ఇప్పుడు టాప్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా పూజా హెగ్డే పేరు కచ్చితంగా ఉంటుంది. మహర్షి, అల వైకుంఠపురములో వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ప్రభాస్ సరసన రాధేశ్యామ్, అఖిల్ హీరోగా వస్తోన్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో పూజా హెగ్డే ఫుల్ బిజీగా ఉంది. వరుస షెడ్యూల్స్‌తో అక్కడా ఇక్కాడ తిరుగుతూ ఉంది. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

Pooja Hegde Funny Dance Video Viral

Pooja Hegde Funny Dance Video Viral

పూజా హెగ్డే తన గ్యాంగ్‌తో కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. 2020లో చివరో వర్కింగ్ డే అంటూ రాధేశ్యామ్ సెట్ ‌నుంచి వెళ్లిపోయిన పూజా హెగ్డే తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో న్యూ ఇయర్ పార్టీని తెగ ఎంజాయ్ చేసేసింది. ఇక మళ్లీ షూటింగ్‌లతో బిజీ అయ్యేట్టు కనిపిస్తోంది. తాజాగా పూజా హెగ్డే ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తన ఫ్రెండ్స్‌తో కలిసి చేసిన అల్లరిని చూపిస్తూనే ఓ తన అల్లరి చేష్టలను కూడా చూపించింది.

డ్యాన్స్ రిహార్సల్స్‌కు వెళ్లే ముందు ఇలా వామ్ అప్ చేస్తానంటూ వీడియోలు చూపించింది. డ్యాన్స్ క్లాసుకు వెళ్లే ముందు ఎలా రెడీ అవుతుందో.. షూస్ ఎలా వేసుకుంటుందో చూపించింది. మ్యూజిక్ వస్తూ ఉంటే గంతులు వేసుకుంటూనే షూస్‌ను ధరించేసింది. షూలను ధరించడం అయిపోయాక ఫ్రెండ్స్ అందరితో కలిసి రచ్చ రచ్చ చేసింది. మొత్తానికి ఈ బుట్టబొమ్మ అల్లరికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. రాధేశ్యామ్‌తో పూజా హెగ్డే నేషనల్ వైడ్‌గా తన సత్తాను చాటాలని ప్రయత్నిస్తోంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp