Poonam Kaur : బావ సినిమా హిట్‌.. అక్కతో చాటింగ్ చేసిన త‌మ్ముడు ఎవ‌రు.. పూన‌మ్ కౌర్ ట్వీట్ వైర‌ల్‌

Authored By Sam C | The Telugu News | Updated on: February 25, 2022, 7:20 pm

Poonam Kaur : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన తాజా చిత్రం భీమ్లా నాయ‌క్.. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. సోష‌ల్ మీడియాలో భీమ్లా నాయ‌క్ ర‌చ్చ న‌డుస్తుంది. ఒరిజినల్ సినిమాతో పోలిక పెట్టాల్సిన అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని మార్చేశారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, పవన్ కళ్యాణ్ పర్ఫామెన్స్, యాటిట్యూడ్, రానా స్వాగ్, తమన్ మ్యూజిక్ ఇలా అన్నీ కూడా దుమ్ముదులిపేశాయి. అయితే భీమ్లా నాయక్ సినిమా మీద పూనమ్ కౌర్ పరోక్షంగా కౌంటర్లు వేస్తుండ‌డం ప్ర‌స్తుతం చర్చ‌నీయాంశంగా మారింది.

పూన‌మ్ కౌర్ రీసెంట్‌గా… ”నేను మనస్ఫూర్తిగా ఆరాధించి, ప్రేమించి వ్యక్తులు ఈ పొలిటికల్ లీడర్స్ దగ్గర వాళ్ళకి వాళ్ళు తక్కువ చేసుకొని, చేతులు జోడించి, చేతులు కట్టుకొని ఉండండం నాకు చాలా బాధగా ఉంది. అవసరాల కోసం కష్టపడి తెచ్చుకున్న వ్యక్తిత్వం వదులుకోవడం మానేయాలి” అని ట్వీట్ చేశారు. వెంట‌నే డిలీట్ చేసింది. ఇక వ‌ర్మ చేసిన ట్వీట్‌కి రిప్లై ఇస్తూ.. ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ఆడవాళ్ల‌ను ఆయుధాలులా వాడుకుంటున్నార‌ని పేర్కొంది. ఇక తాజాగా వాట్సప్ చాట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిందిసినిమాకి వచ్చిన అక్కా.. బావ సినిమా.. ఉదయం 8 గంటలకు.. స్టార్ ఎమోజీలను రిప్లైగా ఇచ్చారు.

poonam kaur tweet topic in social media

poonam kaur tweet topic in social media

ఇక వాటికి సిగ్గుపడుతున్నట్టుగా ఎమోజీలతో పాటు..నిజాయితీగా రివ్యూ చెప్పమని అడుగుతారు. సరే అక్కా అని అవతలి వ్యక్తి రిప్లై ఇస్తారు. అక్కా సినిమా హిట్.. ట్రస్ట్ మీ.. ప్రామీస్ చెబుతున్నా అని అవతలి వ్యక్తి రిప్లై ఇస్తారు. ఈ స్క్రీన్ షాట్‌ను పూనమ్ కౌర్ షేర్ చేయడంతో అసలు చర్చ మొదలైంది. ఇందులో అక్క‌, బావ‌, త‌మ్ముడు, ఈ బాగోతం ఎంట‌నే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది. అయితే ఏది ఎలా ఉన్నా భీమ్లా నాయ‌క్ సినిమా మాస్ హిట్ కావ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు.

Sam C

No bio available for this author.

  1. "Bathing Dinner : భోజనం చేసిన వెంటనే వేడి నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది? నిజం ఇదే"

  2. "Radhika Apte : 41 ఏళ్లలోనే నా శరీరం, కోరికలపై అసలైన క్లారిటీ వచ్చింది: రాధికా ఆప్టే"

  3. "Yanamala Krishnudu : టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనలోకి మాజీ ప్రత్యర్థులు.. కాకినాడ రాజకీయాల్లో కొత్త లెక్కలు"

  4. "Vangaveeti Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం చుట్టూ ముదురుతున్న రచ్చ.. జనసేన-వైసీపీ మధ్య మైండ్‌గేమ్స్..!"

  5. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  6. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  7. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp