Trivikram : త్రివిక్ర‌మ్‌ని వ‌దిలిపెట్టేది లేదు.. ఆయన్ని ఎవ‌రు కాపాడ‌లేరు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Trivikram : త్రివిక్ర‌మ్‌ని వ‌దిలిపెట్టేది లేదు.. ఆయన్ని ఎవ‌రు కాపాడ‌లేరు..!

 Authored By ramu | The Telugu News | Updated on :21 May 2025,3:01 pm

Trivikram : న‌టి పూనమ్ కౌర్ తాజాగా త‌న ఇన్ స్టా వేదిక‌గా రెండు పోస్టులు పెట్టి త్రివిక్ర‌మ్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పుకొచ్చింది.. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.. త్రివిక్రమ్‌ను ఎవ‌రో పొలిటికల్ లీడర్ కాపాడుతున్నారు? అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. ఈ విషయం ముందే చెప్పాను, మళ్లీ చెబుతున్నాను ఈమెయిల్‌లో నా స‌మ‌స్య తెలుపుతూ ఫిర్యాదు చేశాను, ఝాన్సీగారితో మాట్లాడాను, మీటింగ్ పెడదాం అని చెప్పి హఠాత్తుగా నన్ను డిస్టర్బ్ చేయవద్దని చెప్పింది.

Trivikram : పూన‌మ్ కౌర్

నేను ఎవరి పేరు చెప్పలేదు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నాకు ఫిర్యాదు ఉందని స్పష్టంగా చెబుతున్నాను అంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. అంతేకాదు నా వ‌ద్ద సాక్ష్యాలు ఉన్నాయంటూ ఝాన్షీతో చాట్ చేసిన స్క్రీన్ షాట్ల‌ను బ‌య‌ట పెట్టింది. దీంతో గ‌త కొంత కాలంగా స్త‌బ్దుగా ఉన్న‌ ఈ ఇష్యూ మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది.

Trivikram త్రివిక్ర‌మ్‌ని వ‌దిలిపెట్టేది లేదు ఆయన్ని ఎవ‌రు కాపాడ‌లేరు

Trivikram : త్రివిక్ర‌మ్‌ని వ‌దిలిపెట్టేది లేదు.. ఆయన్ని ఎవ‌రు కాపాడ‌లేరు..!

మ‌ల‌యాళ మీటూ ఇష్యూ, జానీ మాస్ట‌ర్ ఇష్యూలు పెద్దెత్తున్న జ‌రుగుతున్న‌ స‌మ‌యాల్లో పూన‌మ్ కౌర్‌ సోష‌ల్ మీడియా ద్వారా ఎక్స్‌లో త్రివిక్ర‌మ్‌పై పోస్టులు చేసి ఆయ‌న‌ను విచారించాలంటూ మా అసోషియేష‌న్‌కు ఫిర్యాదు చేసింది. అయితే సోష‌ల్‌మీడియా ద్వారా అలా పోస్టులు పెడితే కుద‌ర‌దు స్వ‌యంగా ఫిర్యాదు చేయాల‌ని తెల‌ప‌డంతో పూన‌మ్‌ ఈ మెయిల్ ద్వారా క‌మిటీకి విష‌యం తెలిపింది. ఆ త‌ర్వాత ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో ‘మా’ను ఉద్దేశిస్తూ పోస్టు పెట్టారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది