Poonam Kaur : మ‌ళ్లీ వార్త‌ల‌లోకి పూన‌మ్ కౌర్.. ఆ స్టార్ హీరో వేధిస్తున్నాడంటూ కామెంట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Poonam Kaur : మ‌ళ్లీ వార్త‌ల‌లోకి పూన‌మ్ కౌర్.. ఆ స్టార్ హీరో వేధిస్తున్నాడంటూ కామెంట్..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 November 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Poonam Kaur : మ‌ళ్లీ వార్త‌ల‌లోకి పూన‌మ్ కౌర్.. ఆ స్టార్ హీరో వేధిస్తున్నాడంటూ కామెంట్..!

Poonam Kaur : పూన‌మ్ కౌర్.. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కొన్నేళ్ల నుండి పవన్ కళ్యాణ్ , స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఛాన్స్ దొరికిన ప్రతిసారి టార్గెట్ చేస్తూ వస్తోంది. గతేడాది వరకు.. ఎక్కువగా ఆమె ఫోకస్ పవన్ కళ్యాణ్ పైనే ఉండేది. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, అతని రాజకీయ ప్రయాణం గురించి ఆమె పరోక్షంగా అనుచిత వ్యాఖ్యలు చేసేది. ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేసినా కూడా ఆమె త‌న కామెంట్స్‌లో వేడి త‌గ్గించేది కాదు. అయితే కొద్ది రోజుల క్రితం ఏమైందో తెలీదు.. ‘పవన్ కళ్యాణ్ గురించి నేనెప్పుడూ ఏమీ అనలేదు.నేను వేరే స్టార్ హీరోని అతని రాజకీయ ప్రయాణాన్ని వర్ణిస్తూ నా అసహనాన్ని తెలిపాను’ అన్నట్టు చెప్పుకొచ్చింది.

Poonam Kaur ఎవ‌రా హీరో..

తాజాగా పూన‌మ్ కౌర్.. ఓ స్టార్ హీరో త‌న‌ని వేధిస్తున్నాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ వార్తలు సినీ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంతకీ ఏమైందంటే.. ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ” నేను తెలుగులో చేసిన ఒక సోషియో ఫాంటసీ చిత్రంలో నాతో పాటు ఒక అమ్మాయి నటించింది. తర్వాత ఆమె హీరోయిన్ గా కొన్ని రోల్స్ చేసింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆమె సినిమాలు చేయడం ఆపేసింది. అలాగే ఎవరికీ కనిపించకుండా పోయింది. తాజాగా నాకు ఒక డొమెస్టిక్ ఫ్లైట్‌లో కనిపించింది. ఆమె నాతో పెళ్ళికి షాపింగ్ కి వచ్చినట్లు, తాను ఈ దేశంలో ఉన్నట్లు ఎవరికీ చెప్పొదంటూ రిక్వెస్ట్ చేసింది.

Poonam Kaur మ‌ళ్లీ వార్త‌ల‌లోకి పూన‌మ్ కౌర్ ఆ స్టార్ హీరో వేధిస్తున్నాడంటూ కామెంట్

Poonam Kaur : మ‌ళ్లీ వార్త‌ల‌లోకి పూన‌మ్ కౌర్.. ఆ స్టార్ హీరో వేధిస్తున్నాడంటూ కామెంట్..!

అయితే ఆ విష‌యంలో ఏమైందని నేను అడగగా ఆమె సమాధానమిస్తూ.. ‘ఒక సూపర్ స్టార్ డమ్ కలిగిన హీరో నన్ను వేధిస్తున్నాడు.. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఫాలో అవుతున్నాడు. మేము సినిమాలో ఇంటి‌మెటెడ్ సీన్ చేసినప్పుడు ఆయన నా మొహంపై నిజంగానే భారీ మొత్తంలో ఉమ్మి వేశాడు. డైరెక్టర్ కట్ కూడా చెప్పలేదు’ అంటూ చెప్పింది. అలాగే తర్వాత ఆమె ఇండస్ట్రీ వదిలి అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళింది. కానీ.. ఆ హీరో వేదింపులు ఇంకా తగ్గలేదని చెప్పింది. ఇదేమి కట్టు కథ కాదు. ఆ అమ్మాయిని నేను హగ్ చేసుకొని ఓదార్చాను” అంటూ రాసుకొచ్చింది.అయితే ఆ హీరో హీరోయిన్లు ఎవరనే విషయాన్ని పూనమ్ వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఇండస్ట్రీలో చర్చనీయంగా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? వేధింపులకు పాల్పడుతున్న ఆ స్టార్ హీరో? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది