
poorna introduced her husband
Poorna: మలయాళ ముద్దుగుమ్మ పూర్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటిగా 2004లో ఈ అమ్మడు కెరీర్ మొదలైంది. 2007లో విడుదలైన మహాలక్ష్మీ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆమెకు సీమ టపాకాయ్ మూవీ గుర్తింపు తెచ్చింది. 2011లో విడుదలైన ఈ కామెడీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తర్వాత రవిబాబు హారర్ సిరీస్ అవును, అవును 2లో నటించారు. అందంతో పాటు మంచి అభినయం ఉన్న పూర్ణకు కాలం కలిసిరాలేదు. కొన్ని హిట్స్ దక్కినప్పటికీ స్టార్ హీరోయిన్ హోదా పొందలేకపోయారు. కొంత గ్యాప్ తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. స్టార్ హీరోల సినిమాలో సపోర్టింగ్ పాత్రలు చేస్తుంది. అడపాదడపా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు.
డిజిటల్ ఫార్మాట్ లో ఆమెకు కొన్ని అవకాశాలు దక్కుతున్నాయి.ఇప్పుడు పలు టెలివిజన్ షోలు మరియు సినిమాలతో బిజీగా ఉన్న తాను ఈరోజు తన జీవితంలో మరో కొత్త అధ్యాయం స్టార్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నట్టు ప్రకటించింది. తాను తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో జె బి ఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్ షనీద్ అసిఫ్ ఆలీ ని పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేసింది. దీనితో తన ఇతర నటీనటులు ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు సహా ఇతర భాషల్లో ఎన్నో మంచి రోల్స్ చేసిన ఈ అండర్ రేటెడ్ హీరోయిన్ తన జీవితంలో తీసుకుంటున్న కొత్త స్టెప్ కి ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
poorna introduced her husband
ఇటీవల ఢీ సీజన్ 14 నుండి తాను తప్పుకున్నట్లు పూర్ణ వెల్లడించారు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చిన పూర్ణ మాటల్లో మాటగా అసలు విషయం వెల్లడించారు. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ కి రష్మీ, పూర్ణ రావడం జరిగింది. ఇక పూర్ణ, రష్మీకి హైపర్ ఆది, రామ్ ప్రసాద్ వెల్కమ్ చెప్పారు. హైపర్ ఆది పూర్ణ, రష్మీలను ఉద్దేశిస్తూ… ఈ షోకి కొత్తగా వచ్చిన యాంకర్ ఎవరైనా మా అన్నకు హగ్గు ఇవ్వాలని చెప్పాడు. ఆ మాటకు సమాధానంగా పూర్ణ.. ఈ హగ్గులు ఇవ్వలేకే ఢీ షో వదిలేశాను. ఇక ఇక్కడ కూడా హగ్గులు అంటే ఇది కూడా మానేస్తా అని చెప్పారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.