Poorna : బిగ్ బ్రేకింగ్.. కాబోయే భ‌ర్త‌ని ప‌రిచయం చేసిన పూర్ణ‌

 Authored By sandeep | The Telugu News | Updated on :1 June 2022,1:30 pm

Poorna: మ‌ల‌యాళ ముద్దుగుమ్మ పూర్ణ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. నటిగా 2004లో ఈ అమ్మ‌డు కెరీర్ మొదలైంది. 2007లో విడుదలైన మహాలక్ష్మీ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆమెకు సీమ టపాకాయ్ మూవీ గుర్తింపు తెచ్చింది. 2011లో విడుదలైన ఈ కామెడీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తర్వాత రవిబాబు హారర్ సిరీస్ అవును, అవును 2లో నటించారు. అందంతో పాటు మంచి అభినయం ఉన్న పూర్ణకు కాలం కలిసిరాలేదు. కొన్ని హిట్స్ దక్కినప్పటికీ స్టార్ హీరోయిన్ హోదా పొందలేకపోయారు. కొంత గ్యాప్ తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టింది. స్టార్ హీరోల సినిమాలో స‌పోర్టింగ్ పాత్ర‌లు చేస్తుంది. అడపాదడపా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు.

డిజిటల్ ఫార్మాట్ లో ఆమెకు కొన్ని అవకాశాలు దక్కుతున్నాయి.ఇప్పుడు పలు టెలివిజన్ షోలు మరియు సినిమాలతో బిజీగా ఉన్న తాను ఈరోజు తన జీవితంలో మరో కొత్త అధ్యాయం స్టార్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నట్టు ప్రకటించింది. తాను తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో జె బి ఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్ షనీద్ అసిఫ్ ఆలీ ని పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేసింది. దీనితో తన ఇతర నటీనటులు ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు సహా ఇతర భాషల్లో ఎన్నో మంచి రోల్స్ చేసిన ఈ అండర్ రేటెడ్ హీరోయిన్ తన జీవితంలో తీసుకుంటున్న కొత్త స్టెప్ కి ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

poorna introduced her husband

poorna introduced her husband

Poorna : గుడ్ న్యూస్ చెప్పిన పూర్ణ‌..

ఇటీవ‌ల ఢీ సీజన్ 14 నుండి తాను తప్పుకున్నట్లు పూర్ణ వెల్లడించారు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చిన పూర్ణ మాటల్లో మాటగా అసలు విషయం వెల్లడించారు. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ కి రష్మీ, పూర్ణ రావడం జరిగింది. ఇక పూర్ణ, రష్మీకి హైపర్ ఆది, రామ్ ప్రసాద్ వెల్కమ్ చెప్పారు. హైపర్ ఆది పూర్ణ, రష్మీలను ఉద్దేశిస్తూ… ఈ షోకి కొత్తగా వచ్చిన యాంకర్ ఎవరైనా మా అన్నకు హగ్గు ఇవ్వాలని చెప్పాడు. ఆ మాటకు సమాధానంగా పూర్ణ.. ఈ హగ్గులు ఇవ్వలేకే ఢీ షో వదిలేశాను. ఇక ఇక్కడ కూడా హగ్గులు అంటే ఇది కూడా మానేస్తా అని చెప్పారు.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి