
Sri Reddy variety food video viral
Sri Reddy: సంచలనాలకి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన శ్రీ రెడ్డి ఇటీవల కాలంలో యూట్యూబ్ ద్వారా వెరైటీ వంటకాలు పరిచయం చేస్తూ నెటిజన్స్‌కి మంచి థ్రిల్ అందిస్తుంది. వెజ్, నాన్ వెజ్ వంటకాలు వండేస్తూ నానా రచ్చ చేస్తుంది శ్రీ రెడ్డి. తన వంటలతో ఘుమఘుమలాడిస్తోంది శ్రీరెడ్డి. ఆ మధ్య చెన్నైలో మాత్రమే దొరికే ఈలి పీతల పులుసు రుచిచూపించింది. దాంతో పాటుగా.. ఈ పీతల పులుసు రుచి చేస్తే బెడ్ రూంలో నుంచి బయటకు రాలేరంటూ మసాలా దట్టించింది శ్రీరెడ్డి. వెరైటీ వంటకాలతో నానా రచ్చ చేస్తున్న శ్రీ రెడ్డి వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంటాయి. తాజాగా ఆంధ్రా స్టైల్‌లో పులిహోర చేసింది.
మంచి ముచ్చట్లు చెబుతూ శ్రీ రెడ్డి చేసిన పులిహోర తెగ రుచిగా ఉందంటూ కొందరు క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. శ్రీరెడ్డి ఘుమఘుమలు..శ్రీ రెడ్డి పులిహోర తయారీ విధానం పూసగుచ్చినట్టు చెప్పింది. అమ్మడి మాటలకు ముగ్ధులు అవుతున్న ఫ్యాన్స్ వీడియోలని పదే పదే చూస్తూ పరశించిపోతున్నారు. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్థిరపడాలన్న పట్టుదలతో హైదరాబాద్‌లో అడుగు పెట్టింది శ్రీరెడ్డి. ఆ సమయంలోనే ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేసింది. ఆ తర్వాత మోడల్‌గానూ మారింది. అలా చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడిపోయింది. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. సరిగ్గా అప్పుడే ‘నేను నాన్న అబద్ధం’ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది.
Sri Reddy variety food video viral
ఆ తర్వాత ‘అరవింద్ 2’, ‘జిందగీ’ తదితర సినిమాల్లో లీడ్ రోల్ చేసినా గుర్తింపు దక్కలేదు. దీంతో సినీ రంగానికి ఆమె దాదాపుగా దూరంగా ఉండిపోయింది. అప్పుడప్పుడే నటిగా ఎదుగుతోన్న సమయంలోనే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. అవకాశాలు ఇస్తామని చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. అప్పుడు శ్రీరెడ్డికి చాలా మంది అమ్మాయిలు, మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో ఇది ఉద్యమం అయింది. దీంతో బాగా పాపులారిటీని కూడా పెంచుకుంది. అందాల ఆరబోతతో కూడా నానా రచ్చ చేసి హాట్ టాపిక్ అయింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.