Poorna : ఈ ముద్దులేంటి.. ఈ హ‌గ్గులేంటి.. ఢీ షోపై నెటిజ‌న్స్ ఫైర్‌… వీడియో!

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 31 July 2021, 4:06 pm

Poorna బుల్లితెరపై ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్లో రెచ్చిపోతోన్నారు. కొందరు ట్రాకులు నడిపిస్తూ ఫేమస్ అవుతున్నారు. ఇంకొందరు ఆడవాళ్ల పిచ్చి ఉన్నట్టుగా నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అలా ఒక్కొక్కరు తమ పైత్యానికి పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా ఢీ జడ్జ్ పూర్ణ మరో లెవెల్‌లో రెచ్చిపోతోన్నారు. మాస్టర్లకు ఐ లవ్యూలు చెప్పడం, కంటెస్టెంట్లకు ముద్దులు పెడుతూ పూర్ణ తన హద్దులు దాటుతున్నారు.

Poorna KS Chaitany Master In Dhee Show

Poorna KS Chaitany Master In Dhee Show

ఆ ముద్దులేంటి పూర్ణ‌… Poorna

గతంలోనే ఇలానే రెండు మూడు సార్లు జడ్జ్‌గా ఉండాల్సిన హుందాతనాన్ని పూర్ణ కోల్పోతోన్నారు. ఆ స్థానంలో ఉన్నందుకైనా సరే కాస్త పద్దతిగా నడుచుకోవాల్సి ఉంటుంది. అదేమీ లేకుండా కంటెస్టెంట్లు బాగా పర్ఫామెన్స్ చేశారని, మాస్టర్లు బాగా కంపోజ్ చేశారని ఐ లవ్యూలు చెప్పడం, వారి బుగ్గలను కొరకడం, ముద్దులు పెట్టడం వంటివి చేస్తూ అభాసుపాలవుతున్నారు.

Poorna KS Chaitany Master In Dhee Show

Poorna KS Chaitany Master In Dhee Show

తాజాగా వదిలిన ప్రోమోలోనూ పూర్ణ రెచ్చిపోయింది. ఇందులో చైతన్య మాస్టర్ వేసిన స్టెప్పులకు పూర్ణ ఫిదా అయింది. అభి మాస్టర్ డ్యాన్సులకు పడిపోయింది. ఐ లవ్యూ చెప్పేసింది. ఇక చైతన్యను అయితే ఏకంగా బుగ్గను కసిగా కొరికేసింది. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. పూర్ణ ఓవర్ యాక్షన్ తట్టుకోలేక పోతోన్నామని కామెంట్లతో ఆడుకుంటున్నారు. ఇలాంటి షోల‌ను టీవీలో ఎలా చూడాలి అంటూ ఢీ షోపై నెటిజ‌న్లు ఫైర్ అయ్యారు.

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి