Home » Entertainment » Poorna Love With That Comedian Once Upon A Time
Entertainment

Poorna : అప్ప‌ట్లో పూర్ణ ఆ క‌మెడీయన్‌తో ప్రేమాయ‌ణం న‌డ‌పిందా.. అందుకే అన్ని అవ‌కాశాలా?

Authored By
Sam C
The Telugu News | Published on: August 29, 2022, 5:20 pm
Advertisement

Poorna : ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన పూర్ణ ఇప్పుడు స‌పోర్టింగ్ రోల్స్ చేస్తూ స‌త్తా చాటుతుంది. సినిమాల్లో ఆఫ‌ర్లు త‌గ్గిపోవ‌డంతో ఆ త‌ర్వాత ఆమె బుల్లితెర మీద‌కు కూడా ఎంట్రీ ఇచ్చింది. ప‌లు షోల‌కు జ‌డ్జ్‌గా కూడా ప‌నిచేసింది. గ‌తేడాది చివ‌ర్లో వ‌చ్చిన బాల‌య్య అఖండ సినిమాలో క‌థ‌లో కీల‌క పాత్ర‌లో క‌నిపించింది. పూర్ణ టాలీవుడ్ లోకి ‘శ్రీ మహాలక్ష్మి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. వెండితెరపై పూర్ణ హద్దులు దాటే విధంగా ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు. అయితే అవసరమైన మేరకు ఒంపుసొంపులు ఒలకబోసింది. సీమటపాకాయ్ చిత్రం పూర్ణకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.

Advertisement

Poorna : అస‌లు నిజం ఇది..

చిన్న రోల్‌ ఇచ్చినా సరే తన నటనతో పరిపూర్ణం చేసే నటి పూర్ణ. ఆ పర్‌ఫెక్షన్‌ నటనలోనే కాదు అనుసరించే ఫ్యాషన్‌లోనూ ఉండాలనుకుంటుంది. అందుకే ఈ పర్‌ఫెక్ట్‌ బ్రాండ్‌లను ఇష్టపడుతుంది. అవకాశం చిక్కినప్పుడు సినిమాలు చేస్తూనే బుల్లితెరపై పాపులర్ అయింది. ప్రస్తుతం పూర్ణ ఢీ 14 డాన్సింగ్ ఐకాన్ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ షోలో అందరిని ఆకర్షిస్తోంది పూర్ణ. అందరి హీరోయిన్ల లాగే పూర్ణపై కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి. చిత్ర పరిశ్రమలో దర్శకులు, హీరోలు, హీరోయిన్లపై రూమర్లు సహజంగానే పుట్టుకొస్తుంటాయి. రవిబాబు దర్శకత్వంలో హీరోయిన్ పూర్ణ మూడు చిత్రాల్లో నటించింది. అవును, అవును 2, లడ్డుబాబు చిత్రాల్లో రవిబాబు.. పూర్ణకు అవకాశం ఇచ్చారు.

Poorna Love With That Comedian Once Upon A Time

Advertisement

వీరి కాంబోలో వరుస సినిమాలు రావడంతో ఇద్దరి మధ్యా ఏదో ఉంది అంటూ టాలీవుడ్‌లో టాక్ మొదలైంది. దాంతో రవిబాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. తనకు హీరోయిన్ల‌ సంబంధం ఉండదని అన్నారు. షూటింగ్ తరవాత వారికి ఫోన్ కూడా చేయను అని చెప్పారు. తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని…పూర్ణ నటన చూసి ఆమెకు మూడు సినిమాల్లో అవకాశం ఇచ్చానని పేర్కొన్నారు.నేను హీరోయిన్స్ వెనక ప‌డ‌డం నిజమైతే నా సినిమాలు ఏ హీరోయిన్ కూడా చేయ‌దు అని చెప్పుకొచ్చాడు. దీంతో పుకార్ల‌కు చెక్ ప‌డింది. పూర్ణ ఇటీవ‌ల ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకోగా, త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు కూడా ఎక్క‌నుంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ద‌స‌రా సినిమాలో న‌టిస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి