
Mahesh Babu and Ghattamaneni Sithara take remuneration for zee telugu dace show
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరో. ఆయన సినిమాలపై అభిమానులలో ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిట్లు, ఫట్లు అని ఆలోచించకుండా ప్రయోగాత్మక సినిమాలను ఎంకరేజ్చేస్తుంటాడు. ఎలాంటి వివాదాలు లేకుండా తన పని తాను చూసుకుంటూ పోయే హీరోగా ముద్ర వేసుకున్నాడు. అలాగే సినిమాలతోపాటు ఫ్యామిలీ లైఫ్‌ను కూడా బ్యాలెన్స్‌గా మెయింటేన్చేయడంలో మహేశ్‌బాబు తనకు తనే సాటి. ఇక మహేశ్ బాబుకు తన గారాల పట్టి సితార, కొడుకు గౌతమ్అంటే ఎంత ప్రేమో చెప్పనవసరం లేదు. క్షణం సమయం దొరికిన వారితో సరదాగా గడిపేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంటాయి.
అయితే ఇటీవల మహేష్ బాబు ఎక్కువగా రియాలిలటీ షోలలో తెగ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన అన్స్టాపబుల్షోలో మహేశ్‌బాబు పాల్గొన్నాడు. ఆయన మాటలతో, పలు ఆసక్తికర విషయాలతో ఆద్యంత సందడిగా సాగింది ఆ ఎపిసోడ్. తాజాగా మళ్లీ ఓ టీవీ షోలో తళుక్కున మెరిశారు మహేశ్‌బాబు. జీ తెలుగులో ఇటీవలే ప్రారంభమైన హిందీ టెలివిజన్ డ్యాన్స్ రియాలిటీ షో డాన్స్ ఇండియా డ్యాన్స్ యొక్క రాబోయే ఎపిసోడ్‌లో సర్కారు వారి పాట నటుడు మహేష్, అతని ముద్దుల కూతురు సితార ఘట్టమనేని కనిపించనున్నారనేది తాజా వార్త.
Mahesh Babu And Ghattamaneni Sithara Doing Reality Show
ఇప్పటికే వీరిద్దరి ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. డాన్స్ ఇండియా డ్యాన్స్ తెలుగును అకుల్ బాలాజీ హోస్ట్ చేస్తున్నారు. ఈ షోకు ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, నటీమణులు సంగీత, ఆనందిని న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రాగా, ఇందులో మహేశ్‌బాబు స్టైలిష్అవుట్ ఫిట్ధరించగా, సితారా కూడా గ్లిట్టర్ఫ్రాక్వేసుకుని ఆకట్టుకునేలా ఉంది. మరి మహేశ్ బాబు, సితార పాల్గొన్న ఈ షో ఎప్పుడు టెలికాస్ట్అవుతుందో వేచి చూడాలి. కాగా మహేశ్‌బాబు 28వ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2023 ఏప్రిల్28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.