Poorna : బుల్లితెరపై పూర్ణ చేస్తోన్న రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఎవ్వరికీ తెలియడం లేదు. ఒకరోజు జబర్దస్త్ షోలో కనిపిస్తోంది. ఇంకో రోజు శ్రీదేవీ డ్రామా కంపెనీ షొలోకి వస్తుంది. మరో రోజు ఢీ షో జడ్జ్‌గా కూర్చుంటోంది. అలా అన్ని చోట్లకు ఆమె తిరిగేస్తోంది. అలా మొత్తానికి బుల్లితెరపై మాత్రం పూర్ణ హవా కొనసాగుతోంది. ఇక పూర్ణ పెట్టే ముద్దులు, బుగ్గలను కొరికే తీరు, హగ్గులు ఇచ్చే అత్యుత్సాహం అన్నీ ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. ఢీ షోలో హైపర్ ఆది చేసే ఎక్స్ ట్రాలు, వేసే పంచ్‌ల గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రియమణి ఉన్నన్ని రోజులు.. ప్రియా అంటూ పిలిచాడు.
ఇక ఆమె కూడా బావా అంటూ ఆదిని పిలిచేది. ఈ ట్రాక్‌ను ప్రేక్షకులు భరించలేకపోయారు. ఫుల్ నెగెటివిటీ ఏర్పడంతో మధ్యలో ఆపేశారు. ఇక ఆది అయితే వచ్చిన ప్రతీ గెస్ట్ మీద, జడ్జ్ మీద తన కోరికను బయటపెడుతుంటాడు. హగ్ కోసం పరితపిస్తుంటాడు. రవికృష్ణ నవ్యస్వామిల జోడి మీద కౌంటర్లు వేస్తుంటాడు. ఇప్పుడు ఆ ఇద్దరూ కూడా షోకు రావడం లేదు. సుధీర్ రష్మీ వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ అఖిల్ సార్థక్‌ను తీసుకుని వచ్చారు. అఖిల్ వేసే పంచులు, సెటైర్లు కూడా ఈ మధ్య పేలుతున్నాయి. ఇంతకు ముందు అయితే కేవలం ఆది మాత్రమే పంచ్‌లు వేస్తుండేవాడు. ఇప్పుడు అఖిల్ కూడా కౌంటర్లు వేస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో పూర్ణ మాట్లాడిన మాటలు ద్వందార్థాలకు దారి తీశాయి.
Poorna Satires on Akhil Sarthak And Hyper Aadi
ఓ రొమాంటిక్ పర్ఫామెన్స్ చూసిన పూర్ణ.. అందులో చేసినట్టుగానే ఆది,అఖిల్‌లు ముద్దు పెట్టుకోవాలని టాస్క్ ఇచ్చింది పూర్ణ. దీంతో అఖిల్ షాక్ అయ్యాడు. మీకు ఇలాంటి ఐడియాలు ఎందుకు వస్తున్నాయ్ అని అఖిల్ అంటాడు. నువ్ ఇలాంటి పనులు చేస్తుంటే.. అలాంటి ఐడియాలే వస్తాయ్ అని ఆది కౌంటర్లు వేస్తాడు. ఇద్దరూ ముద్దులు పెట్టుకోవడంలో ఫెయిల్ అవ్వడంతో.. అఖిల్‌ది ఓడింది అని అంటుంది పూర్ణ. నాది కూడా ఓడిందా? అని ఆది డబుల్ మీనింగ్ డైలాగ్ వేస్తాడు. ఇద్దరిదీ ఓడింది అని పూర్ణ అంటుంది. మొత్తానికి పూర్ణ మాటలకు అందరూ నవ్వేశారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.