Poorna : క‌ళావ‌తి సాంగ్‌ని దించేసిన పూర్ణ‌.. ఈ బ్యూటీ స్టెప్స్‌కి ముగ్ధుల‌వుతున్న ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Poorna : క‌ళావ‌తి సాంగ్‌ని దించేసిన పూర్ణ‌.. ఈ బ్యూటీ స్టెప్స్‌కి ముగ్ధుల‌వుతున్న ఫ్యాన్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :24 February 2022,3:30 pm

Poorna : పూర్ణ‌.. ఈ అమ్మ‌డు తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. ప‌లు సినిమాల‌లో న‌టించిన పూర్ణ‌ రియాలిటీ షోలతో బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు అయ్యారు. డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జిగా ఆమె నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచారు. అయితే లేటెస్ట్ సీజన్ ఢీ 14 నుండి పూర్ణ తప్పుకున్నారు. కారణం ఏదైనా ప్రియమణి కొనసాగుతుండగా పూర్ణ మాత్రం ఢీ 14 చేయడం లేదు.త్రీ రోజెస్ తో ప్రేక్షకులను పలకరించింది హీరోయిన్ పూర్ణ . కామెడీ. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 3 రోజెస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇండిపెండెంట్ ఉమన్ ఇందు పాత్రలో పూర్ణ ఆకట్టుకున్నారు. ‘తీస్ మార్ ఖాన్’ మూవీలోనూ నటించింది పూర్ణ.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పూర్ణ అప్పుడ‌ప్పుడు అందాల ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజ‌న్స్ కి మాంచి కిక్ ఇస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ క‌ళావ‌తి సాంగ్‌కి అద్దిరిపోయే స్టెప్పులు వేసింది. మ‌హేష్ బాబు మాదిరిగా పూర్ణ వేసిన డ్యాన్స్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ప్ర‌స్తుతం పూర్ణ డ్యాన్స్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. కళావతి అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ అందర్నీ మెప్పిస్తుంది. ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి విడుదలైన ఈ ఫస్ట్​ లిరికల్​ సాంగ్ యూట్యూబ్​లో ట్రెండింగ్​లో వెళ్తూ, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇటీవల ప్రేమికుల దినోత్సవం రోజున విడుదలైన ఈ సాంగ్ బాగా పాపులర్ అయింది.

poorna shake legs with kalavathi dance

poorna shake legs with kalavathi dance

Poorna : డ్యాన్స్‌తో మ‌తులు పోగొడుతుందిగా..!

ఇందులో మహేష్ వేసిన స్టెప్పులు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇక అప్పట్నుంచి ఈ పాటతో పాటు మహేష్ స్టెప్పులు వేస్తూ రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రేక్షకులు, నెటిజన్లతో పాటు స్టార్స్ సైతం కళావతి సాంగ్ కి స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇటీవలే మహేష్ కూతురు సితార, హీరోయిన్ కీర్తి సురేష్ లు కళావతి సాంగ్ కి స్టెప్పులు వేసి దుమ్ము దులిపేశారు. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ సినిమాను మే 12న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది