Saroja Devi : సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. పాపులర్ హీరోయిన్ కన్నుమూత
Saroja Devi : దక్షిణాది చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటి బి. సరోజా దేవి (87) ఇకలేరు. కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.
Saroja Devi : సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. పాపులర్ హీరోయిన్ కన్నుమూత
1938 జనవరి 7న బెంగళూరులో జన్మించిన సరోజాదేవి, కేవలం 13 ఏళ్ల వయసులోనే సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే తొలుత వాటిని తిరస్కరించిన ఆమె, 1955లో ‘మహాకవి కాళిదాసు’ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని పేరు తెచ్చుకున్నారు.1957లో వచ్చిన ‘పాండురంగ మహాత్మ్యం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి దిగ్గజ హీరోలతో కలసి పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించారు.
ఇంటికి దీపం ఇల్లాలు,మంచి చెడు, దాగుడు మూతలువంటి సినిమాల్లో ఆమె నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆమెకు, అన్ని దక్షిణాది భాషల్లో విశేష ఆదరణ లభించింది. 1985లో ‘లేడీస్ హాస్టల్’ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఆమె భర్త అనారోగ్యం పాలయ్యారు. 1986లో ఆయన మృతి చెందడంతో, ఒక్కసారిగా ఆమె సినిమా ప్రపంచానికి దూరమయ్యారు. భర్త మరణానికి ముందు అంగీకరించిన సినిమాలు పూర్తిచేసిన తరువాత ఐదేళ్ల విరామం తీసుకొని ఆ తర్వాత నటించింది.
Lokesh & Ram Mohan Naidu : తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఒక పెద్ద కుటుంబంలా కొనసాగుతూ వస్తోంది.…
విశాఖపట్నం పర్యటనలో భాగంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రుషికొండలో గత ప్రభుత్వ కాలంలో నిర్మించిన విలాసవంతమైన…
Chiranjeevi | అభిమానం హద్దులు దాటి, జీవితాన్నే పణంగా పెట్టి తన అభిమాన నటుడిని కలవాలని పట్టుదలగా ప్రయత్నించిన ఓ మహిళా…
War 2 | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2 .కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన…
Barrelakka | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో “బర్రెలక్క”గా అందరి దృష్టిని ఆకర్షించిన శిరీష్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచింది.…
Hansika | స్టార్ హీరోయిన్ హన్సిక వ్యక్తిగత జీవితంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు హల్చల్ చేస్తున్న…
LOBO | టీవీ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.…
Sleep | మానసిక ఒత్తిడి, ఆహార అలవాట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో…
This website uses cookies.