Saina Nehwal : సైనా–కశ్యప్ విడాకులు.. ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు
Saina Nehwal : భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ Saina Nehwal మరియు మాజీ అంతర్జాతీయ షట్లర్ పారుపల్లి కశ్యప్ తమ ఏడేళ్ల వివాహ బంధాన్ని ముగించినట్లు అధికారికంగా ప్రకటించారు. 2018లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట, ప్రస్తుతం విడిపోయిన విషయాన్ని సైనా స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
Saina Nehwal : సైనా–కశ్యప్ విడాకులు.. ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు
“బహుళ ఆలోచనలు, చర్చల తర్వాత కశ్యప్‌తో కలిసి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేము ప్రశాంతత, వ్యక్తిగత ఎదుగుదల, మానసిక శాంతిని ఎంచుకుంటున్నాం. కశ్యప్‌తో గడిపిన తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటాయి. ఇకపై మేము మిత్రులుగా మిగులుతాం. ఈ సమయంలో మా గోప్యతను గౌరవించాలని అభ్యర్థిస్తున్నాం” అని సైనా తన భావోద్వేగపూరిత పోస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ తీసుకుంటూ సైనా–కశ్యప్ మధ్య స్నేహం బలపడింది. ఆ స్నేహమే క్రమంగా ప్రేమగా మారి 2018లో వివాహ బంధానికి దారి తీసింది. అప్పట్లో ఈ జంట దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ ప్రేమికులకు ఆదర్శంగా నిలిచింది.సైనా నెహ్వాల్.. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి దేశ గర్వంగా నిలిచింది. 2015లో మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్గా నిలిచింది పారుపల్లి కశ్యప్..2014 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించాడు. ఆటకు వీడ్కోలు చెప్పిన తరువాత ప్రస్తుతం బ్యాడ్మింటన్ కోచింగ్ పట్ల దృష్టిసారిస్తున్నాడు. ఉందని చెబుతున్నారు
Telangana Education Sector : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోని పాఠశాలలు,…
Lokesh & Ram Mohan Naidu : తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఒక పెద్ద కుటుంబంలా కొనసాగుతూ వస్తోంది.…
విశాఖపట్నం పర్యటనలో భాగంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రుషికొండలో గత ప్రభుత్వ కాలంలో నిర్మించిన విలాసవంతమైన…
Chiranjeevi | అభిమానం హద్దులు దాటి, జీవితాన్నే పణంగా పెట్టి తన అభిమాన నటుడిని కలవాలని పట్టుదలగా ప్రయత్నించిన ఓ మహిళా…
War 2 | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2 .కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన…
Barrelakka | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో “బర్రెలక్క”గా అందరి దృష్టిని ఆకర్షించిన శిరీష్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచింది.…
Hansika | స్టార్ హీరోయిన్ హన్సిక వ్యక్తిగత జీవితంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు హల్చల్ చేస్తున్న…
LOBO | టీవీ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.…
This website uses cookies.