Saroja Devi : సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం.. పాపుల‌ర్ హీరోయిన్ క‌న్నుమూత‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Saroja Devi : సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం.. పాపుల‌ర్ హీరోయిన్ క‌న్నుమూత‌

 Authored By ramu | The Telugu News | Updated on :14 July 2025,11:57 am

ప్రధానాంశాలు:

  •  Saroja Devi : సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం.. పాపుల‌ర్ హీరోయిన్ క‌న్నుమూత‌

Saroja Devi : దక్షిణాది చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటి బి. సరోజా దేవి (87) ఇకలేరు. కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.

Saroja Devi సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం పాపుల‌ర్ హీరోయిన్ క‌న్నుమూత‌

Saroja Devi : సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం.. పాపుల‌ర్ హీరోయిన్ క‌న్నుమూత‌

Saroja Devi : పాపుల‌ర్ న‌టి..

1938 జనవరి 7న బెంగళూరులో జన్మించిన సరోజాదేవి, కేవలం 13 ఏళ్ల వయసులోనే సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే తొలుత వాటిని తిరస్కరించిన ఆమె, 1955లో ‘మహాకవి కాళిదాసు’ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని పేరు తెచ్చుకున్నారు.1957లో వచ్చిన ‘పాండురంగ మహాత్మ్యం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి దిగ్గజ హీరోలతో కలసి పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించారు.

ఇంటికి దీపం ఇల్లాలు,మంచి చెడు, దాగుడు మూతలువంటి సినిమాల్లో ఆమె నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆమెకు, అన్ని దక్షిణాది భాషల్లో విశేష ఆదరణ లభించింది. 1985లో ‘లేడీస్ హాస్టల్’ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఆమె భర్త అనారోగ్యం పాలయ్యారు. 1986లో ఆయన మృతి చెందడంతో, ఒక్కసారిగా ఆమె సినిమా ప్రపంచానికి దూరమయ్యారు. భర్త మరణానికి ముందు అంగీకరించిన సినిమాలు పూర్తిచేసిన తరువాత ఐదేళ్ల విరామం తీసుకొని ఆ త‌ర్వాత న‌టించింది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది