Posani Krishna Murali : ఆ హీరో స్థాయి అది, నీ స్థాయి ఇది.. పరువుదీసిన పోసాని

Authored By Cinema Desk | The Telugu News | Published on: September 28, 2021, 6:50 pm

Posani Krishna Murali రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల సెగలు ఇంకా తగ్గడం లేదు. రాజకీయా ప్రతి దాడులు జరుగుతూనే ఉన్నాయి. వైసీపీ మంత్రులు పవన్ కల్యాణ్ మీద విరుచుకుపడుతున్నారు. అయితే సినిమా పరిశ్రమ నుంచి మాత్రం ఏ ఒక్కరూ కూడా పాజిటివ్‌గా గానీ, నెగెటివ్‌గా గానీ స్పందించలేదు. కానీ నిన్న రాత్రి పోసాని మీడియా ముందుకు వచ్చాడు. పవన్ కళ్యాణ్‌ను ఎన్ని రకాలుగా తిట్టాలో అన్ని రకాలుగా తిట్టారు. అదే సమయంలో చిరంజీవిని, ఆయన వ్యక్తిత్వాన్ని పొగిడేశాడు.

Posani Krishna Murali On Pawan Kalyan Remuneration

Posani Krishna Murali On Pawan Kalyan Remuneration

పవన్ కళ్యాణ్ పరువుదీసిన పోసాని Posani Krishna Murali

ఇక మాటల్లో మాటగా పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి మాట్లాడాడు. రిపబ్లిక్ ఈవెంట్‌లో రెమ్యూనరేషన్‌ల గురించి మాట్లాడుతూ.. ఓ పది కోట్లు ఇస్తారనుకోండి అని జనరల్‌గా చెప్పాడు పవన్ కళ్యాణ్. అదే విషయాన్ని పోసానీ గుర్తుకు చేశాడు. నీ రెమ్యూనరేషన్ కూడా నువ్ చెప్పుకోలేవు.. నువ్ మాట్లాడుతున్నావా? నువ్ పది కోట్లకు సినిమా చేస్తావా? నేను పదిహేను ఇస్తాను.. నాకు నాలుగు సినిమాలు చేస్తావా? అని నిలదీశాడు. నీ అసలు రెమ్యూనరేషన్ యాభై కోట్లు. కాదని చెప్పు. నన్ను కొట్టు అని తన స్టైల్లో వాయించాడు.

Pawan Kalyan About Prabhas Rana NTR And Ram Charan In Republic Pre Release Event

Pawan Kalyan About Prabhas Rana NTR And Ram Charan In Republic Pre Release Event

మొత్తం నువ్వే సెలెక్ట్ చేసుకుంటావ్.. హీరోయిన్ దగ్గరి నుంచి ప్రతీ ఒక్కటీ నువ్వే సెలెక్ట్ చేసుకుంటావ్.. నిర్మాతల వ్యవహారాల్లో దూరుతావ్.. ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్నార్ నిర్మాతల వ్యవహారాల్లోకి దూరేవారు కాదు. ఎన్ని హిట్లు వచ్చినా కూడా ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ పెంచుకోలేదు. కన్నడ రాజ్ కుమార్ అయితే.. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలను అడిగి మరీ రెమ్యూనరేషన్ పెంచుకుంటాడు. అది వ్యక్తిత్వం అంటే. ఆయన ఎక్కడ నువ్ ఎక్కడ అని ఏకిపారేశాడు.

 

Pawan Kalyan About Prabhas Rana NTR And Ram Charan In Republic Pre Release Event

Pawan Kalyan About Prabhas Rana NTR And Ram Charan In Republic Pre Release Event

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp