Acharya : మెగా ఫ్యాన్స్‌కి షాక్ ఆచార్య రిలీజ్ పోస్ట్‌పోన్..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Acharya : మెగా ఫ్యాన్స్‌కి షాక్ ఆచార్య రిలీజ్ పోస్ట్‌పోన్..?

 Authored By govind | The Telugu News | Updated on :6 April 2021,9:16 pm

Acharya : మెగా ఫ్యాన్స్ డిసప్పాయింట్ న్యూస్ ఇది. మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్ – మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రాం చరణ్ – నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంతేకాదు రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్‌కి జంటగా కాజల్ అగర్వాల్.. చరణ్‌కి జంటగా హీరోయిన్ పూజా హెగ్డే కనిపించబోతోంది. రెజీనా కసాండ్ర స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతుండగా ఇప్పటికే రిలీజైన లాహే లాహే సాంగ్ లో సంగీత కనిపించింది.

postponement of Acharya Movie release

postponement of Acharya Movie release

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి హాట్ టాపిక్ గా మారింది. ఆచార్య సినిమాని దేశ వ్యాప్తంగా మే 13న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు ఆచార్య సినిమాని థియేటర్స్ లో చూస్తామా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆచార్య సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తోంది. అందుకు కారణం ఆచార్య సినిమా షూటింగ్ ఇంకా కాస్త బ్యాలెన్స్ ఉందట. అంతేకాదు వీఎఫెక్స్ వర్క్ కూడా ఇంకా చాలా వరకు పూర్తి కావాల్సి ఉందని సమాచారం.

Acharya : ఆచార్య సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారట.

దాంతో ఆచార్య పోస్ట్ పోన్ చేసేలా సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడు ఫిక్స్ చేసుకున్న రిలీజ్ డేట్ మిస్ అయితే మళ్ళీ సోలో డేట్ దొరకడం చాలా కష్టం. ప్రభాస్ రాధే శ్యాం సహా పలు భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్ డేట్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆచార్య సినిమాకి మళ్ళీ సోలో డేట్ ఎప్పుడు దొరుకుతుందో చూడాలి. ఇక త్వరలో బ్యాలెన్స్ టాకీ పార్ట్ కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన లాహే లాహే సాంగ్ సినిమా మీద భారీగా అంచనాలు క్రియేట్ చేసింది. ఇక త్వరలో ఆచార్య సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారట.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది