Parameshwar Reddy : ఉప్పల్‌లో కాంగ్రెస్ బలోపేతమే మా లక్ష్యం : మందుముల పరమేశ్వర్ రెడ్డి

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 30 May 2026, 7:00 pm
  •  Parameshwar Reddy : ఉప్పల్‌లో కాంగ్రెస్ బలోపేతమే మా లక్ష్యం : మందుముల పరమేశ్వర్ రెడ్డి

హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని పలువురు ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇంచార్జిలు, కోఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు, డివిజన్ కమిటీల నిర్మాణం, రాబోయే రాజకీయ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు కీలక సూచనలు చేశారు.

Parameshwar Reddy : ఉప్పల్‌లో కాంగ్రెస్ బలోపేతమే మా లక్ష్యం : మందుముల పరమేశ్వర్ రెడ్డి

Parameshwar Reddy : ఉప్పల్‌లో కాంగ్రెస్ బలోపేతమే మా లక్ష్యం : మందుముల పరమేశ్వర్ రెడ్డి

Parameshwar Reddy బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి

ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ, మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్ ఏజెంట్లు, డివిజన్ కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ బలమైన సంస్థాగత నిర్మాణంతోనే భవిష్యత్ రాజకీయ సవాళ్లను ఎదుర్కోగలదని పేర్కొన్న ఆమె, ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై పార్టీకి బలమైన పునాది వేయాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు కమిటీలను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

Parameshwar Reddy SIR ప్రక్రియ, ప్రజా పాలన ప్రచారంపై చర్చ

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న SIR (Special Intensive Revision) ప్రక్రియపై సమగ్ర చర్చ జరిగినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో పార్టీ క్యాడర్ పోషించాల్సిన పాత్ర, అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయాలని పిలుపునిచ్చారు. ప్రజా పాలనలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించడం ద్వారా పార్టీకి మరింత మద్దతు లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.సమావేశంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ ఇంచార్జిలు మైనంపల్లి హన్మంతరావు, బండి రమేష్, కోలన్ హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు ఉప్పల్ నియోజకవర్గంలో బూత్ ఏజెంట్లు, డివిజన్ కమిటీల ఏర్పాటు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. SIR ప్రక్రియలో కార్యకర్తలను భాగస్వామ్యం చేస్తూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు.అలాగే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు చేరవేసి కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి