
prabhas fans tensed with his health
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి కోసం దాదాపు ఐదేళ్లు పని చేయడంతో ప్రభాస్ అభిమానులు ఆయన సినిమాలని చాలా మిస్ అయ్యారు. ఈ క్రమంలోనే ప్రభాస్ నాన్‌స్టాప్ సినిమాలు చేస్తున్నారు. ఇందులో ప్రాజెక్ట్ కె చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె అవుట్ ఫుట్ టెర్రిఫిక్ గా ఉందని అన్నారు అశ్వినిదత్. ఈ చిత్రాన్ని అమెరికా, చైనాతో పాటు అనేక దేశాల్లో పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ చేస్తాం. అవెంజర్స్ తరహాలో ఉండబోతోంది. 2023 జనవరి కల్లా షూటింగ్ పూర్తవుతుంది. 8 నెలల పాటు విఎఫెక్స్ వర్క్ ఉంటుంది. కుదిరితే 2023 అక్టోబర్ 18న రిలీజ్ చేస్తాం. అదే నెలలో ప్రభాస్ బర్త్ డే కూడా ఉంది. కుదరకపోతే 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తాం అని అశ్విని దత్ అన్నారు.
అలానే ప్రభాస్ సర్జరీ గురించి కూడా తెలియజేశారు అశ్వినీదత్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కాలికి సర్జరీ నిమిత్తం ఆయన విదేశాలకు వెళ్ళాడట. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ వెల్లడించారు. వాస్తవానికి, ‘సీతారామం’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కోసం ప్రభాస్ రావాల్సి వుందనీ, అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయాడని చెబుతూ, ప్రభాస్ కాలికి సర్జరీ విషయాన్ని నిర్మాత అశ్వనీదత్ బయట పెట్టారు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏమైందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని కొందరు కామెంట్ చేస్తున్నారు.
prabhas fans tensed with his health
రెబల్ స్టార్ ప్రభాస్ ఈ యేడాది ‘రాధే శ్యామ్’ తో ప్రేక్షకులను నిరాశ పరిచారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్‌తో సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా వచ్చే యేడాది విడుదల కానుంది. మరోవైపు ’సలార్’ షూటింగ్ చివరి దశకు వచ్చింది. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ K’ లైన్‌లో ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తోన్న ‘సలార్’ షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.