Prabahs : ‘ఎందుకు అన్నా ఇలా చేసావ్ ‘ తల పట్టుకుంటోన్న ప్రభాస్ వీరాభిమానులు !

Authored By Sam C | The Telugu News | Published on: January 22, 2022, 2:40 pm

Prabahs : బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఆయ‌న సినిమా లైన‌ప్ చూస్తే అంద‌రు ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయం. ప్ర‌భాస్ న‌టించిన రాధే శ్యామ్ చిత్రం విడుద‌ల‌కి సిద్ధంగా ఉండ‌గా, స‌లార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కె తో పాటు ప‌లు చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. అయితే బాహుబ‌లి సినిమాతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ప్ర‌భాస్ గ‌తంలో ఐదు క్రేజీ బ్లాక్ బస్టర్ లని వదులుకోవాల్సి వచ్చిందట. ఆ చిత్రాలు మాస్ మహారాజా రవితేజ సూపర్ స్టార్ మహేష్ కు ఐకాన్ స్టార్ బన్నీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కెరీర్ లో మరపురాని చిత్రాలుగా మిగిలిపోయాయి.

ర‌వితేజ న‌టించిన చిత్రం కిక్. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ మూవీకి సీక్వెల్ కూడా రూపొందింది. అయితే కిక్ చిత్రం ఆఫ‌ర్ ముందుగా ప్ర‌భాస్ చెంత‌కు రాగా, కొన్ని కార‌ణాల వ‌ల‌న వ‌దిలేసుకున్నాడు. ఆ తరువాత అల్లు అర్జున్ నటించిన `ఆర్య` మూవీ కోసం సుకుమార్ ముందు ప్రభాస్ ని సంప్రదించారట. కాని క‌థ అత‌డికి నచ్చ‌క‌పోవ‌డంతో రిజెక్ట్ చేశాడు. ఇక మ‌హేష్ కెరీర్ లో మైల్ స్టోన్‌గా నిలిచిన ఒక్క‌డు చిత్రంలో కూడా ప్ర‌భాస్ న‌టించాల్సింద‌ట‌.చిత్రంలో కబడ్డీ గేమ్ వుండటం దాని వల్ల ప్రమాదం ఏర్పడుతుందని భావించిన ప్రభాస్ ఈ కథని సున్నితంగా తిరస్కరించారట.

prabahs missed 5 crazy projects

prabahs missed 5 crazy projects

Prabahs : ప్ర‌భాస్ భ‌లే మిస్ చేశాడే..!

ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మహేష్ కెరీర్ ని మలుపు తిప్పిన విషయం తెలిసిందే. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో రికార్డుల్ని తిరగరాసిన చిత్రం `సింహాద్రి` మూవీ కూడా ముందు ప్రభాస్ ద‌గ్గ‌ర‌కే వ‌చ్చింద‌ట‌. అయితే ఈ పాత్ర త‌న‌కు సూట్ కాద‌ని ప్ర‌భాస్ సున్నితంగా తిర‌స్క‌రించార‌ట‌. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన `నాయక్` మూవీ కూడా ప్రభాస్ చేయాల్సిందే నని డేట్స్ వ‌ల‌న ఆ ప్రాజెక్ట్‌కి దూరంగా ఉన్నాడ‌ని అంటున్నారు. ఇలా ప్ర‌భాస్ ఐదు బ్లాక్ బ‌స్ట‌ర్స్ చిత్రాల‌ని ప‌లు కార‌ణాల వ‌ల‌న వ‌దులుకున్నాడు. ఇవి క‌నుక చేసి ఉంటే ప్ర‌భాస్ క్రేజ్ మ‌రింత‌గా పెరిగి ఉండేద‌ని అంటున్నారు.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp