Anchor Suma : పని మనిషి మీద జోకులు.. యాంకర్ సుమ వీడియో వైరల్
Anchor Suma : యాంకర్ సుమ తెరపై ఎంత సరదాగా ఉంటుందో.. తెర వెనుకా అంతే సరదాగా ఉంటుంది. ఇక సుమ తన సోషల్ మీడియా ఖాతాల్లో చేసే అల్లరి మామూలుగా ఉండదు. యూట్యూబ్ చానెల్‌లో సుమ చేసే అల్లరి ఇక వేరే లెవెల్‌లో ఉంటుంది. అయితే తాజాగా సుమ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తన పని మనిషిని ఆట పట్టించిన తీరు అందరినీ నవ్వించేసింది.
సుమ ప్రస్తుతం జయమ్మ పంచాయితీ సినిమా బిజీలో ఉందన్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్, ప్రమోషన్స్ అంటూ ఫుల్లుగా తిరిగేస్తుంది. ఇక సుమ వెంటనే తన టీం మొత్తం పరిగెడుతుందన్న సంగతి తెలిసిందే. సుమ వీడియోలను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారికీ అందరూ తెలుస్తుంటారు. ఇక సుమ వంటలు చేసే వీడియోల్లో ఎక్కువగా తన పని మనిషి కనిపిస్తుంటుంది.

Anchor Suma Shares Her Maid Geetha First Flight Journey
Anchor Suma : సుమ ఫన్నీ వీడియో..
గీత అనే పని మనిషిని రకరకాలుగా సుమ భయపెడుతూ ఉంటుంది. అయితే ఆమెను కూడా ఈ సారి తనతో పాట బయటకు తీసుకెళ్లింది సుమ. ఆమె మొదటి సారిగా ఫ్లైట్ ఎక్కుతుండటంతో ఆమెను ఆటాడుకుంది. ప్రతీ చోటా గీతను ముందు పెట్టింది.. వాళ్లకు దండం పెట్టు.. కుడి కాలు ముందు పెట్టు.. అంటూ ఇలా రకరకాలుగా గీతను సుమ ఆడేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
View this post on Instagram