prabahs missed 5 crazy projects
Prabahs : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయన సినిమా లైనప్ చూస్తే అందరు ఆశ్చర్యపోవడం ఖాయం. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం విడుదలకి సిద్ధంగా ఉండగా, సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కె తో పాటు పలు చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. అయితే బాహుబలి సినిమాతో అశేష ప్రేక్షకాదరణ పొందిన ప్రభాస్ గతంలో ఐదు క్రేజీ బ్లాక్ బస్టర్ లని వదులుకోవాల్సి వచ్చిందట. ఆ చిత్రాలు మాస్ మహారాజా రవితేజ సూపర్ స్టార్ మహేష్ కు ఐకాన్ స్టార్ బన్నీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కెరీర్ లో మరపురాని చిత్రాలుగా మిగిలిపోయాయి.
రవితేజ నటించిన చిత్రం కిక్. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీకి సీక్వెల్ కూడా రూపొందింది. అయితే కిక్ చిత్రం ఆఫర్ ముందుగా ప్రభాస్ చెంతకు రాగా, కొన్ని కారణాల వలన వదిలేసుకున్నాడు. ఆ తరువాత అల్లు అర్జున్ నటించిన `ఆర్య` మూవీ కోసం సుకుమార్ ముందు ప్రభాస్ ని సంప్రదించారట. కాని కథ అతడికి నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాడు. ఇక మహేష్ కెరీర్ లో మైల్ స్టోన్‌గా నిలిచిన ఒక్కడు చిత్రంలో కూడా ప్రభాస్ నటించాల్సిందట.చిత్రంలో కబడ్డీ గేమ్ వుండటం దాని వల్ల ప్రమాదం ఏర్పడుతుందని భావించిన ప్రభాస్ ఈ కథని సున్నితంగా తిరస్కరించారట.
prabahs missed 5 crazy projects
ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మహేష్ కెరీర్ ని మలుపు తిప్పిన విషయం తెలిసిందే. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో రికార్డుల్ని తిరగరాసిన చిత్రం `సింహాద్రి` మూవీ కూడా ముందు ప్రభాస్ దగ్గరకే వచ్చిందట. అయితే ఈ పాత్ర తనకు సూట్ కాదని ప్రభాస్ సున్నితంగా తిరస్కరించారట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన `నాయక్` మూవీ కూడా ప్రభాస్ చేయాల్సిందే నని డేట్స్ వలన ఆ ప్రాజెక్ట్‌కి దూరంగా ఉన్నాడని అంటున్నారు. ఇలా ప్రభాస్ ఐదు బ్లాక్ బస్టర్స్ చిత్రాలని పలు కారణాల వలన వదులుకున్నాడు. ఇవి కనుక చేసి ఉంటే ప్రభాస్ క్రేజ్ మరింతగా పెరిగి ఉండేదని అంటున్నారు.
Today Gold Price : ఈ మే 6వ తేదీ మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల…
Mint Health Benefits : పుదీనా ఆకులు మన వంటకాలకు రుచికరమైనది మాత్రమే కాదు. అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను…
Farmers : అకాల వర్షాలు రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి…
Liver Diseases : కాలేయం మానవ శరీరంలోని అతిపెద్ద ఘన అవయవం. ఇది అనేక ముఖ్యమైన మరియు జీవితాన్ని కొనసాగించే…
10th Pass : టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్ధులకి అదిరిపోయే శుభవార్త. విజయనగరం జిల్లా రాజం పట్టణంలో 2024…
Caffeine : కెఫీన్ ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగించబడే సైకోయాక్టివ్ సమ్మేళనం. మీరు కాఫీ లేదా టీ తాగకపోయినా, మీరు ఇప్పటికీ…
Cucumber : మీరు రిఫ్రెషింగ్, ఆరోగ్యకరమైన చిరుతిండి కోసం చూస్తున్నట్లయితే కీర దోసకాయలు ఒక గొప్ప ఎంపిక. వాటిలో కేలరీలు…
Mango Tree ఇది సమ్మర్ సీజన్. మామిడి కాయలు విరివిగా కాస్తుంటాయి. మ్యాంగో లవర్స్ కూడా ఈ సీజన్లో మామిడి…
This website uses cookies.