Home » Entertainment » Prabhas Adipurush Movie Update
Entertainment

Adipurush Movie : ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే బ్రేకింగ్ న్యూస్ : ఆదిపురుష్ మార్కెట్ చూడండి !

Authored By
aruna
The Telugu News | Updated on: June 8, 2023 3:28 pm
Advertisement

Adipurush Movie : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ త్వరలోనే ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తే హిట్ అయినట్టు అనేదానిపై సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ జరుగుతోంది. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా అదే రీతిలో బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల నుండి సమాచారం. ఈ సినిమా మినిమం 500 కోట్లు వసూలు చేస్తే గాని ఆదిపురుష్ హిట్ అయినట్టు కాదని అంటున్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సెకండ్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

Advertisement

ఈవెంట్ తో మరింతగా సినిమాకి పబ్లిసిటీ వచ్చింది. కచ్చితంగా సినిమా లాభాలు తెచ్చిపెడుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా చిన్న జీయర్ స్వామి హాజరు అయ్యారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో నటించాడు. ఇక సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. అలాగే ఈ సినిమాకి పోటీగా మరే సినిమా లేదు. దీంతో ఈ సినిమాకి పాజిటివ్ టాక్ కనుక వస్తే అత్యధిక వసూళ్లను సాధించడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. అసలు ఈ సినిమా ఈ ఎడాది జనవరి నెలలో విడుదల కావాల్సి ఉంది.

prabhas Adipurush Movie update

Advertisement

కానీ గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ సరిగ్గా లేకపోవడంతో సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కి గురైంది. దీంతో ఈ సినిమాను మొత్తం మార్చి లేటెస్ట్ గ్రాఫిక్స్ యాడ్ చేసి జూన్ 16న విడుదల చేస్తున్నారు. ప్రభాస్ గత సినిమాలు భారీ డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో ప్రభాస్ ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. మరీ ఈ సినిమా ఎటువంటి టాక్ ను ఇస్తుందో చూడాలి. ఏది ఏమైనా ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో అదరగొట్టేస్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసేవన్ని పాన్ ఇండియా సినిమాలే. అవి కూడా అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు కావడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ రాజా డీలక్స్, స్పిరిట్, ప్రాజెక్ట్ కె సినిమాలు చేస్తున్నాడు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి