Prabhas : ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. డ్రగ్స్ రహిత తెలంగాణకు ప్రభాస్ క్యాంపెయిన్..!
ప్రధానాంశాలు:
Prabhas : ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. డ్రగ్స్ రహిత తెలంగాణకు ప్రభాస్ క్యాంపెయిన్..!
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ డ్రగ్స్ రహిత తెలంగాణా సమాజం కోసం తన వంతు బాధ్యతగా క్యాంపెయిన్ చేస్తున్నారు. డ్రగ్స్ తీసుకోకూడదు అనేది ఒక సెలబ్రిటీ ద్వారా చెప్పిస్తే ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. అందుకే ప్రభుత్వం తరపున ఈ క్యాంపెయిన్ ను స్టార్ హీరోలు చేస్తుంటారు. లేటెస్ట్ గా ప్రభాస్ తెలంగాణా ప్రభుత్వం నుంచి డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటుచేయాలని పిలుపు ఇచ్చారు. ఈ క్రమంలో ప్రభాస్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లైఫ్ లో మనకు చాలా ఎంజాయ్ మెంట్స్ ఉన్నాయి.. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనసులు.. మనకోసం బ్రతికే మన వాళ్లు ఉన్నారు అలాంటప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అంటూ ప్రభాస్ మెసేజ్ ఇచ్చాడు.
సే నో టు డ్రగ్స్ టుడే.. మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్ కి బానిసై ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 8712671111 నంబర్ కి కాల్ చేయండి అని వీడియో మెసేజ్ ఇచ్చాడు. డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజమే ప్రభుత్వ లక్ష్యం అంటూ తెలంగాణా ప్రభుత్వానికి ప్రభాస్ క్యాంపెయిన్ చేస్తున్నాడు. స్టార్ హీరొలు ఇలా ప్రభుత్వం తరపున ఇన్షియేట్ తీసుకుని ఇలాంటి క్యాపెయిన్ చేస్తే ప్రజలకు మరింత చేరువయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఇక ప్రభాస్ సినిమాల ద్వారా పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రభాస్ సినిమా వస్తుంది అంటే నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. బాహుబలి నుంచి కల్కి 2898 ఏడి వరకు ప్రభాస్ పాన్ ఇండియా ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా హను రాఘవపుడి డైరెక్షన్లో ఫౌజి.. సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. ప్రభాస్ సినిమా వస్తుంది అంటే రెబల్ ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే. తన సినిమాలతోనే కాదు ఇలాంటి ప్రభుత్వ క్యాంపెయిన్ లతో కూడా రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ని సరైన మార్గంలో నడిచేలా చేస్తున్నాడు. Prabhas, Campaign for Drugs Controle, Telangana State, Rebal Star Prabhas